NTV Telugu Site icon

Budget 2024: ఆర్థిక వేత్తలు, నీతి అయోగ్ అధికారులతో ప్రధాని మోడీ భేటీ

Modi

Modi

మోడీ 3.0 సర్కార్ తొలిసారి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. మిత్రపక్షాల సపోర్టుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఈ బడ్జెట్‌పై అన్ని రాష్ట్రాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ప్రధానంగా మిత్రపక్షాల రాష్ట్రాలైతే గంపెడాశలు పెట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈనెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా గురువారం ప్రధాని మోడీ అధ్యక్షతన బడ్జెట్ కసరత్తుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థికవేత్తలు, నీతి ఆయోగ్ అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ప్రణాళిక మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్, ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్, ఆర్థికవేత్త సూర్జిత్ భల్లా, వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, ప్రముఖ బ్యాంకర్ కెవి కామత్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: ప్రజలకు సేవ చేస్తే భగవంతుడుకి చేసినట్టే.. అదే బాటలో సేవ చేస్తా..

మోడీ 3.0 ప్రభుత్వం జూలై 23న తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించనుంది. కేంద్ర బడ్జెట్ 2024-25కి సంబంధించి విస్తృత సంప్రదింపులలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సీనియర్ నీతి ఆయోగ్ అధికారులు మరియు ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశం నిర్వహించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాబోయే బడ్జెట్‌పై తమ అభిప్రాయాలను సేకరించేందుకు ఆర్థిక మంత్రి సీతారామన్ ఇప్పటికే భారతీయ పరిశ్రామికవేత్తలు, రాష్ట్ర ఆర్థిక మంత్రులు, ఆర్థికవేత్తలతో విస్తృత చర్చలు జరిపారు.

ఇది కూడా చదవండి: Maharaja: మహారాజా వస్తున్నాడు.. పరాక్ బహు పరాక్

లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2024-25 కోసం పూర్తి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేందుకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.