Site icon NTV Telugu

PM Narendra Modi:ఉజ్జయిని “మహాకాల్​ లోక్ కారిడార్​”ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

Ujjain Mahakaleswar Temple

Ujjain Mahakaleswar Temple

PM Narendra modi dedicates Shri Mahakal Lok to the nation: మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకాల్ లోక్ కారిడార్ మొదటి దశలను ప్రారంభించే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయ వస్త్రధారణలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలో శివుడిని దర్శించుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియాలు ప్రధాని మోదీ వెంట ఉన్నారు.

Read Also: Dog Missing: తప్పిపోయిన పూజారి శునకం.. సీసీ కెమెరాలు శోధించి పట్టుకున్న పోలీసులు

గర్భగుడిలోకి ఒంటరిగా ప్రవేశించిన మోదీ అక్కడి పూజారులతో కలిసి 20 నిమిషాల పాటు పూజల్ని నిర్వహించారు. గర్భగుడిలో రుద్రాక్ష మాల పట్టుకుని 10 నిమిషాల పాటు ధ్యానం చేశారు. పూజలు ముగిసిన తర్వాత గవర్నర్ మంగూభాయ్ పటేల్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు ప్రధాని మోదీ. అంతకుముందు అహ్మదాబాద్ నుంచి ఇండోర్ చేరుకున్న ప్రధాని మోదీకి మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ స్వాగతం పలికారు.

రూ. 856 కోట్ల వ్యయంతో మహాకాళేశ్వర ఆలయ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టు ‘ మహాకాల్ లోక్ కారిడార్’ మొదటి దశను ప్రారంభించారు. మొదటి దశను రూ.316 కోట్లతో డెవలప్ చేశారు. మహాకాల్ లోక్ కారిడార్ ను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. 900 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న కారిడార్, దేశంలోనే అతిపెద్ద కారిడార్లలో ఒకటి. ఇది ప్రసిద్ధ మహాకాళేశ్వర దేవాలయం చుట్టూ రుద్రసాగర్ సరస్సు చుట్టూ విస్తరించి ఉంది.

Exit mobile version