PM Narendra Modi celebrates Diwali with army: సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, భారత సైనికులతో దీవపాళి వేడుకలను జరుపుకున్నారు. కార్గిల్ సెక్టార్ లో భారత సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రతీ దీపావళిని సైనికులతోనే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైనికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అధికారం లేకుండా శాంతిని పొందడం అసాధ్యమని సైనికులతో అన్నారు. తమ ప్రభుత్వం యుద్ధాన్ని చివరి ఎంపికగా భావిస్తుందని ప్రధాని అన్నారు.
మేము ఎప్పుడూ యుద్ధాన్ని చివరి ఆప్షన్ గా భావిస్తాము. అది లంకలో జరిగానా.. లేక కురుక్షేత్రంలో జరిగినా చివరి వరకు దాన్ని నిరోధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని.. మేము ప్రపంచశాంతికి అనుకూలంగా ఉన్నామని పీఎం మోదీ అన్నారు. సైనికులను తన కుటుంబం అని ఆయన పేర్కొన్నారు. వారు లేకుండా దీపావళి జరుపుకోనని.. సైన్యం ధైర్యసాహసాలను కొనియాడారు పీఎం మోదీ. కార్గిల్ విజయం లేనిదే పాకిస్తాన్ తో యుద్ధాన్ని చూడలేమని అన్నారు. ద్రాస్, బటాలిక్, టైగర్ హిల్ మన సైనికులు అత్యున్నత దైర్యానికి సాక్ష్యాలుగా నిలిచాయని.. కార్గిల్ లో మన సైనికులు ఉగ్రవాదాన్ని అణిచివేశారని ప్రధాని అన్నారు.
Read Also: John Shaw passed away: బయోకాన్ సీఈవో కిరణ్ మజుందార్ షా భర్త కన్నుమూత
భారతదేశాన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం గౌరవంగా చూస్తుందని.. మీరు మన సరిహద్దులను రక్షించినప్పుడే..మనం మన శత్రువులపై కఠిన వైఖరి తీసుకుంటామని అన్నారు. మా సాయుధ దళాలు వారి సొంత భాషలో శత్రువులకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలుసని అన్నారు. భారతసైన్యం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సైనిక సామాగ్రిని తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సరిహద్దులను రక్షించినప్పుడు, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే దేశం సురక్షితంగా ఉంటుందని.. గత ఎనిమిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుందని అన్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన పౌరులకు భారత జెండా రక్షణ కవచంగా నిలిచిందని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా దేశంలో నిర్మయాత్మక యుద్ధం జరుగుతోందని.. అవినీతిపరులు ఎంత శక్తివంతమైనవారైనా తప్పించుకోలేరని హెచ్చరించారు. భారత సైన్యంలోకి మహిళలు రావడంపై‘‘ భారత సైన్యంలోకి మా కుమార్తెల రాకతో మా శక్తి పెరుగుతోంది’’ అని అన్నారు.
