Site icon NTV Telugu

PM Modi: ఉడుపి నాకు చాలా ప్రత్యేకమైంది.. గతాన్ని నెమరువేసుకున్న మోడీ

Pm Modi

Pm Modi

ఉడుపి రావడం తనకు చాలా ప్రత్యేకమైంది అని ప్రధాని మోడీ అన్నారు. కర్ణాటకలోని ఉడుపిలో మోడీ పర్యటించారు. అంతకముందు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ఇరువైపుల నుంచి ప్రజలు పూల వర్షం కురిపించారు. అనంతరం ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠానికి వచ్చారు. ఈ సందర్భంగా లక్ష కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొన్నారు. జగద్గురు శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ విశ్వగీత పర్యాయ.. ప్రధాని మోడీని సత్కరించారు.

ఇది కూడా చదవండి: Putin: పుతిన్ భారత్ షెడ్యూల్ ఖరారు.. ఎన్ని రోజులంటే..!

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఉడుపి జనసంఘ్, భారతీయ జనతా పార్టీకి సుపరిపాలన నమునాకు కర్మభూమిగా పేర్కొన్నారు. 1968లో ఉడుపి ప్రజలు జనసంఘ్ నుంచి వీఎస్.ఆచార్యను మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నుకున్నారని గుర్తుచేశారు. ఉడుపిలో కొత్త పాలనకు ప్రజలు పునాది వేశారని తెలిపారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: ‘ఢిల్లీ పొల్యూషన్’పై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. రాహుల్‌గాంధీ డిమాండ్

ఈ కార్యక్రమానికి విద్యార్థులు, సన్యాసులు, పండితులు, వివిధ రంగాలకు చెందిన పౌరులతో భగవత్ గీతను ఏకగ్రీవంగా పారాయణం చేయించారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన పిల్లలు దగ్గర నుంచి చిత్రాలను సేకరించాలని భద్రతా సిబ్బందిని, పోలీసు సిబ్బందిని మోడీ కోరారు.

Exit mobile version