Site icon NTV Telugu

PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోడీ పర్యటన

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలిసారి మోడీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్‌కు వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 19నే ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ అప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది. ఇంతలో మూడు రోజులు వ్యవధిలో ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది. అనంతరం భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.

ఇది కూడా చదవండి: XChat: వాట్సాప్ కు పోటీగా ఎక్స్‌చాట్‌.. మొబైల్ నంబర్‌ లింక్ చేయకుండానే వాడుకోవచ్చు

జూన్ 6న చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. అలాగే శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ ప్రత్యేక కాశ్మీర్ ఎడిషన్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఈ వేదికగా ఉగ్రవాదం అణిచివేతపై ప్రధాని మోడీ కీలక సందేశం ఇచ్చే అవకాశం ఉంది. ఇక మోడీ పర్యటన కోసం భద్రతా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.

ఇది కూడా చదవండి: West Bengal: మేనల్లుడిని చంపిన అత్త.. అసలు కథేంటంటే..!

గత వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. పాకిస్థాన్ దాడులతో దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. అలాగే మరణించిన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.

Exit mobile version