NTV Telugu Site icon

PM Modi: జూలై 8న ప్రధాని మోడీ రష్యా పర్యటన.. భారీ ఏర్పాట్లు చేస్తున్న క్రెమ్లిన్..

Putin ,modi

Putin ,modi

PM Modi: ప్రధానిమంత్రి నరేంద్రమోడీ రష్యా పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. జూలై 08న మోడీ రష్యాకు వెళ్లనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కానున్నారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడంతో పాటు ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోడీ పర్యటన కోసం ఇప్పటికే రష్యా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు క్రెమ్లిన్ అధికార వర్గాలు తెలిపాయి.

Read Also: Pawan Kalyan: నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం.. అంజన్నను దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్

మంగళవారం రోజు రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ.. మేము భార ప్రధాని పర్యటనకు సిద్ధమవుతున్నాయి. అయితే తేదీలు ఇంకా చెప్పలేము. ఎందుకంటే తేదీలను ఇరు దేశాలు ప్రకటిస్తాయని అన్నారు. కానీ తాము పర్యటన కోసం చురుకుగా సిద్ధమవుతున్నాము. ఈ పర్యటన జరుగుతుందని నేను నొక్కి చెబుతున్నాను అని విలేకరులతో అన్నారు.

ఈ ఏడాది పుతిన్ రష్యా అధ్యక్షుడిగా 5వ సారి ప్రమాణస్వీకారం చేయగా, నరేంద్రమోడీ భారత ప్రధానిగా మూడోసారి అధికారాన్ని చేపట్టారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ఇది ప్రధాని మోడీ తొలి రష్యా పర్యటన అవుతుంది. ఉక్రెయిన్ వార్‌ని భారత్ ఇప్పటికి ఖండించలేదు. ఇరు దేశాలు దౌత్య, సంభాషణలతో చర్చించుకోవాలని సూచించింది. చివరిసారిగా రష్యా అధినేత పుతిన్ 2021లో భారత్‌లో పర్యటించారు. వార్షిక భారత్-రష్యా సమ్మిట్‌కి హాజరయ్యారు. సెప్టెంబర్ 16, 2022లో ఉజ్బెకిస్తాన్ సమర్‌కండ్‌లో జరిగే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు.