Site icon NTV Telugu

PM Modi: నేడు అరుణాచల్‌ప్రదేశ్, త్రిపురలో మోడీ పర్యటన

Modi

Modi

ప్రధాని మోడీ సోమవారం రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రూ.5,100 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. జలవిద్యుత్, మౌలిక సదుపాయాలు, మాతా త్రిపుర సుందరి ఆలయ అభివృద్ధి సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి: IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్ లో ప్లేయర్ల మధ్య గొడవ.. రెచ్చిపోయిన అభిషేక్!

తొలుత ప్రధాని మోడీ అరుణాచల్‌ప్రదేశ్‌ను సందర్శించనున్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (240 మెగావాట్లు), టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (186 మెగావాట్లు) ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేస్తారు. మొత్తం రూ. 3,700 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌లు చేపట్టనున్నారు. ఇక తవాంగ్‌లో 9,820 అడుగుల ఎత్తులో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 1,500 మందికి పైగా అతిథులు కూర్చునే సామర్థ్యం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Asia Cup 2025: పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం!

అనంతరం త్రిపురను మోడీ సందర్శించనున్నారు. ప్రసాద్ పథకం కింద మాతాబరి దగ్గర మాతా త్రిపుర సుందరి ఆలయ సముదాయం అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. 51 శక్తి పీఠాల్లో ఒకటైన పురాతన ఆలయం, కొత్త మార్గాలు, ధ్యాన మందిరం, అతిథి వసతి, ప్రత్యేకమైన తాబేలు ఆకారపు లేఅవుట్‌లో రూపొందించబడిన ఇతర సౌకర్యాలతో సహా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. ఈ ప్రాజెక్ట్ తీర్థయాత్ర పర్యాటకాన్ని పెంచుతుందని, ఉపాధిని సృష్టిస్తుందని, గోమతి జిల్లా, పరిసర ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

Exit mobile version