NTV Telugu Site icon

PM Modi: ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపొందింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మంత్రిమండలితో సహా రాజీనామా సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పదవిలో కొనసాగాలని ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలిని రాష్ట్రపతి కోరారు. జూన్ 8న మరోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Read Also: ICC T20 World Cup: పాకిస్తాన్‌కు భారీ షాక్‌.. స్టార్‌ ప్లేయర్‌ ఔట్!

2024 లోక్‌సభ ఎన్నికల్లో 543 ఎంపీ స్థానాలకు గానూ 240 సీట్లను గెలుచుకుంది. అయితే ఎన్డీయే కూటమిగా 293 స్థానాలు సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 272ని దాటింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంతగా 282, 303 సొంతంగా సాధించింది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు మాత్రం జేడీయూ, తెలుగుదేశం వంటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 233 సీట్లను సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌కి చాలా దూరంగా నిలిచిపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతగా 370 సీట్లు సాధించాలని అనుకున్నప్పటికీ, 240కి పరిమితమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల ఎన్డీయే మీటింగ్ జరగనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా లేఖ సమర్పించే అవకాశం ఉంది.