ICC T20 World Cup: పాకిస్తాన్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imad Wasim ruled out of USA vs PAK Match in T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. మెగా టోర్నీలో భాగంగా గురువారం (జూన్ 6) డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో అమెరికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం గాయం కారణంగా యూఎస్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. విశ్రాంతి తీసుకోవాలని అతడికి పీసీబీ మెడికల్ టీమ్ సూచించింది.
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇమాద్ వసీం ప్రస్తుతం ప్రక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి వారం రోజుల సమయం పట్టనున్నట్లు సమాచారం. వసీం ప్రస్తుతం ప్రక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడని, యూఎస్ మ్యాచ్‌లో అతడు ఆడడం లేదని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడని చెప్పాడు. వసీం తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని.. పాక్ తరపున రీఎంట్రీ ఇచ్చాడు. వసీం పాక్ తరఫున 55 వన్డేలు, 72 టీ20లు ఆడాడు. వన్డేల్లో 986, టీ20ల్లో 535 రన్స్ చేశాడు. 127 మ్యాచ్‌లు ఆడిన వసీం.. ఒక్క సెంచరీ కూడా చేయలేదు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
Also Read: Chandrababu Naidu-Ram Charan: చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్!
పాకిస్తాన్ జట్టు:
బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, ఉస్మాన్ ఖాన్.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!