NTV Telugu Site icon

PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి డొమినికా అత్యున్నత పురస్కారం..

Pm Modi To Receive Dominica's Highest Honour

Pm Modi To Receive Dominica's Highest Honour

PM Modi: కోవిడ్-19 మహమ్మారి సమయంలో తమకు చేసిన సహాయానికి కరేబియన్ దేశం డొమినికా ప్రధాని నరేంద్రమోడీకి అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసినందుకు గుర్తింపుగా కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తన అత్యున్నత జాతీయ అవార్డు ‘‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’’‌ని ప్రధానం చేసింది. నవంబర్ 19 నుండి 21 వరకు గయానాలోని జార్జ్‌టౌన్‌లో జరగనున్న ఇండియా-కారికామ్ సమ్మిట్ సందర్భంగా కామన్‌వెల్త్ అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఈ అవార్డును ప్రదానం చేస్తారని డొమినికన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Team India: టీ20ల్లో భారత్ విజృంభణ.. ఆస్ట్రేలియా రికార్డు సమం

‘‘ఫిబ్రవరి 2021లో, ప్రధానమంత్రి మోడీ డొమినికాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేసారు – ఇది డొమినికా తన కరేబియన్ పొరుగువారికి మద్దతునిచ్చేందుకు వీలు కల్పించింది” అని ప్రకటన పేర్కొంది. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డొమినికాకు భారత్ చాలా మద్దతు అందిస్తోంది. మోడీ చేసిన ఈ కృషికి ఈ అవార్డును ఇస్తోంది. డొమినికా ప్రాంతానికి ప్రధాని మోడీ సంఘీభావం తెలిపినందుకు ఈ అవార్డుని తమ దేశం థాంక్స్ తెలియజేస్తోందని డొమినికా ప్రధాని రూజ్ వెల్ట్ స్కెరిట్ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ అవార్డు ప్రతిపాదనను అంగీకరిస్తూ, వాతావరణ మార్పు మరియు భౌగోళిక రాజకీయ సంఘర్షణల వంటి సవాళ్లను పరిష్కరించడంలో ప్రపంచ సహకారం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని మోదీ హైలైట్ చేశారు మరియు ఈ సమస్యలను పరిష్కరించడంలో డొమినికా మరియు కరేబియన్‌లతో కలిసి పనిచేయడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ధృవీకరించారు. భారత్-కారికోమ్ సమ్మిట్‌కి ప్రెసిడెంట్ బర్టన్ , ప్రధాని స్కెరిట్ హాజరవుతారు. ఈ సమావేశంలో భారత్, కరేబియన్ కమ్యూనిటీ(కారికోమ్) సభ్యదేశాల మధ్య సహకారం, ప్రాధాన్యతలు, అవకాశాల గురించి చర్చిస్తారు.