Site icon NTV Telugu

PM Modi: నేడు జమ్మూకాశ్మీర్‌లో మోడీ పర్యటన.. చీనాబ్ వంతెన ప్రారంభించనున్న ప్రధాని

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ శుక్రవారం జమ్ముూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈరోజు ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెనను మోడీ ప్రారంభించనున్నారు. రూ.46,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి: Shashi Tharoor: ఆపరేషన్ సింధూర్ గురించి శశి థరూర్ ను ప్రశ్నలడిగిన కుమారుడు.. తండ్రి చెప్పిన సమాధానం ఇదే!

చీనాబ్ రైలు వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. ఐఫెల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది. ఈ చీనాబ్ వంతెన 1,315 మీటర్లు విస్తరించి ఉంది. కఠినమైన వాతావరణాన్ని తట్టుకునే విధంగా నిర్మించారు. చీనాబ్ రైల్వే వంతెన జమ్మూకాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో నిర్మించారు. శ్రీనగర్ రైల్వే లైన్‌పై ఇంజనీరింగ్ విభాగం అద్భుతంగా నిర్మించింది. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునే విధంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఈ ప్రాంతం భూకంప జోన్ 5లోకి వస్తుంది. మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించే యాత్రికుల కోసం ఈ వంతెనను నిర్మించారు.  ఇక ప్రారంభించబోయే ఇతర ప్రాజెక్టుల్లో 272 కి.మీ. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ కూడా ఉంది.

ఇది కూడా చదవండి: ENG vs IND: ఇక నుంచి ఇంగ్లండ్‌లో టెండ్యూలర్-అండర్సన్‌ ట్రోఫీ!

ఇక చీనాబ్ రైలు వంతెనను నిర్మించడానికి దాదాపు 30,000 టన్నుల ఉక్కును ఉపయోగించారు. ప్రస్తుతం ఇదే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా నిలుస్తుంది. చీనాబ్ వంతెన నిర్మాణం 2002లో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా ప్రారంభమైంది.

ఇక చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు.  అంతేకాకుండా ఈ వేదికగా ఉగ్రవాదం అణిచివేతపై ప్రధాని మోడీ కీలక సందేశం ఇచ్చే అవకాశం ఉంది. ఇక మోడీ పర్యటన కోసం భద్రతా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Exit mobile version