NTV Telugu Site icon

PM Narendra Modi: రేపు కర్తవ్యపథ్‌తో పాటు నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం 7 గంటలకు ఇండియా గేట్ వద్ద కర్తవ్యపథ్‌తో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటుందని, ఈ అమృత్‌కాల్ మన దేశం పట్ల మన కర్తవ్యాన్ని నిర్వర్తించేలా మనల్ని ప్రేరేపించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాబట్టి, రాజ్‌పథ్ పేరు కర్తవ్య మార్గంగా మార్చాలని నిర్ణయించామని తెలిపారు. చారిత్రాత్మక నిర్ణయానికి పౌరులందరి అభినందనలు చెప్పారు. అమృత్ కాలంలో మాతృభూమికి సేవ చేయాలనే నిబద్ధతను ఇది చాటుతుందని అన్నారు. నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉండే రోడ్డును రాజ్‌పథ్‌‌గా పిలుస్తారు. ఇకపై దీనిని కర్తవ్య్ పథ్‌గా పిలవనున్నారు. గురువారం ప్రధాని మోడీ ఇండియా గేట్‌ వద్ద కర్తవ్య్ పథ్‌తో పాటు నేతాజీ విగ్రహాన్ని అవిష్కరించనున్నారు. కాగా విగ్రహా పొడవు 28 అడుగులు కాగా బరువు 65 మెట్రిక్ టన్నులుతో రూపొందిన ఏకశిల విగ్రహాం కావడం గమనార్హం. ప్రధాన శిల్పి అయిన అరుణ్ యోగిరాజ్ చేత రూపొందించబడింది. అంతకుముందు పరాక్రమ్ దివాస్(జనవరి 23)రోజున విగ్రహా హోలోగ్రామ్ ను ప్రధాని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

కర్తవ్య పథ్ మార్గంలో అందమైన ప్రకృతి దృశ్యాలు, నడక మార్గాలతో కూడిన పచ్చిక బయళ్ళు, పచ్చని ప్రదేశాలు, పునరుద్ధరించిన కాలువలు, కొత్త సౌకర్యాల బ్లాక్‌లు, వెండింగ్ కియోస్క్‌లు ప్రదర్శించబడతాయి. ఇంకా, కొత్త పాదచారుల అండర్‌పాస్‌లు, మెరుగైన పార్కింగ్ స్థలాలు, కొత్త ఎగ్జిబిషన్ ప్యానెల్‌లు, అప్‌గ్రేడ్ చేసిన నైట్ లైటింగ్ వంటి కొన్ని ఇతర ఫీచర్లు ప్రజల అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వరదనీటి నిర్వహణ, ఉపయోగించిన నీటిని రీసైక్లింగ్ చేయడం, రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, నీటి సంరక్షణ, శక్తి-సమర్థవంతమైన లైటింగ్ సిస్టమ్‌లు వంటి వాటిని ఇక్కడ ఏర్పాటు చేశారు. గ్రానైట్‌తో చేసి ఆ విగ్రహం మన స్వాతంత్య్ర పోరాటానికి నేతాజీ చేసిన అపారమైన కృషికి తగిన నివాళి, దేశం ఆయనకు రుణపడి ఉంటుందనడానికి చిహ్నంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు.

Congress Party: ఆయనే కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు.. పార్టీ చీఫ్‌పై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి..

ఢిల్లీ రాజ్ పథ్ మార్గాన్ని కర్తవ్య పథ్‌గా మారుస్తున్నట్లు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ఇవాళ వెల్లడించారు. స్వాతంత్య్రానంతరం వలసవాద ఆలోచనా విధానాన్ని మార్చాలనే దిశగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. ప్రజాసేవ అనేది పాలించే హక్కు కాదని సేవ చేసే హక్కని స్ఫురించేలా ఈ పేరును తీసుకున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ మీడియా సమావేశంలో బుధవారం ఆమె మాట్లాడారు. ఈ మేరకు పేరు మార్పుకు సంబంధించిన తీర్మానాన్ని ఎన్డీఎంసీ పాస్ చేసింది. స్వాతంత్య్రానంతరం వలసవాద ఆలోచనా విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాం. ‘రాజు పాలన చేయాలనే ఆలోచనను రాజ్‌పథ్ తెలియజేస్తోంది.