Site icon NTV Telugu

India’s 1st Solar-Powered Village: దేశంలోనే తొలి సోలార్ గ్రామంగా మోధేరా.. ఈ రోజు ప్రధాని అధికార ప్రకటన

Modhera First Solar Village

Modhera First Solar Village

PM Modi To Declare Modhera As India’s 1st Solar-Powered Village: దేశంలో గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించే విధంగా అడుగులు పడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్యాన్ని నివారించేందుకు సోలార్ ఎనర్జీ, విద్యుత్ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు ముడి చమురు దిగుమతిని తగ్గించుకుని, విదేశీమారక నిల్వలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే దేశంలోనే తొలి సోలార్ గ్రామంగా గుజరాత్ రాష్ట్రంలో మోధేరా గ్రామం రికార్డులకెక్కనుంది. గుజరాత్ రాష్ట్రంలోని మోహసానా జిల్లాలో ఉంది మాధేరా.

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఈ గ్రామాన్ని భారతదేశంలో మొట్టమొదటి సౌరశక్తితో నడిచే గ్రామంగా ప్రకటించనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. మోధేరా గ్రామంలో ప్రసిద్ధ సూర్య దేవాలయం ఉంది. గుజరాత్ ప్రభుత్వం గ్రామంలో మొత్తం 1000 సోలార్ ప్యానెళ్లను అమర్చింది. వీటి ద్వారా గ్రామంలో 24 గంటలు విద్యుత్ అందుబాటులో ఉంటుంది. జీరో ఖర్చుతో గ్రామానికి సౌరవిద్యుత్ అందించడం గర్వకారణం అని గుజరాత్ ప్రభుత్వం ట్వీట్ చేసింది. భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచాలనే ప్రధానమంత్రి దార్శనికతను దృష్టిలో పెట్టుకుని, గుజరాత్ లో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.

Read Also: Mohan Raja: స్టోరీలో మెగాస్టార్ వేలు పెడతారని అన్నవాళ్లను కొట్టేస్తా..!!

చారిత్మాత్మక ప్రదేశంగా ఉన్న మోధేరా గ్రామంలోని సూర్య దేవాలయంలో అక్టోబర్ 9న 3-డి ప్రొజెక్షన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. సౌరశక్తితో నడిచే 3-డి ప్రొజెక్షన్ ను ప్రధాన మోదీ జాతికి అంకితం చేయనున్నారు. మోధేరా చరిత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ 3-డి షోను చూసేందుకు ప్రజలు సందర్శించవచ్చు. మోధేరాలోని సూర్యదేవాలయం పుష్పవతి నడి ఒడ్డున ఉంది. దీన్ని 1026-27 లో చాళుక్య వంశానికి చెందిన రాజు భీమ-1 నిర్మించారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ఉండటంతో కూడా అక్కడి ప్రభుత్వం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులను ప్రారంభిస్తోంది.

Exit mobile version