గుజరాత్లోని మెహసానా జిల్లాలోని మొధేరాను తొలి సంపూర్ణ సోలార్ గ్రామంగా ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగా మొధేరా ప్రసిద్ధి చెందిందని.. ఇప్పటి నుంచి సూర్య గ్రామంగా పిలుస్తారని ప్రధాని మోడీ వెల్లడించారు.
PM Modi To Declare Modhera As India's 1st Solar-Powered Village: దేశంలో గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించే విధంగా అడుగులు పడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్యాన్ని నివారించేందుకు సోలార్ ఎనర్జీ, విద్యుత్ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు ముడి చమురు దిగుమతిని తగ్గించుకుని, విదేశీమారక నిల్వలను పెంచుకునే �