ప్రధాని మోడీ ప్రతి ఏడాది ఒక్కో చోట దీపావళి జరుపుకుంటారు. సైనికులతో కలిసి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది ఆపరేషన్ సిందూర్‌కు గుర్తుగా గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Indian Army: పాక్‌పై భారత్ మరో దాడి.. 1971 నాటి లొంగుబాటు ఫొటో వైరల్
2014లో మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సాయుధ దళాలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గతేడాది గుజరాత్‌లోని కచ్‌లోని సర్ క్రీక్‌లో వేడుకలు జరుపుకున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం ఆపరేషన్ సిందూర్ గుర్తుగా గోవా తీరంలో జరుపుకోనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ట్రంప్‌ను చూసి మోడీ భయపడ్డారు.. రాహుల్‌గాంధీ ఎద్దేవా
2014లో లడఖ్‌లో.. 2016లో హిమాచల్ ప్రదేశ్‌లో.. 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌లో వేడుకలు జరుపుకున్నారు. 2020లో మాత్రం కరోనా సమయంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని లాంగేవాలాలో జరుపుకున్నారు. 2021లో జమ్మూ కాశ్మీర్‌లోని నౌషెరాలో సైనికులతో గడిపారు.
మే 7న పాకిస్థాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అనంతరం పాకిస్థాన్ కాల్పుల విరమణకు రావడంతో భారత్ అంగీకరించింది. మే 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
