PM Modi: మరో విదేశీ పర్యటనకు మోడీ.. జీ7 సదస్సుకు హాజరు

  • మరో విదేశీ పర్యటనకు మోడీ
  • జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరు
  • ధృవీకరించిన భారత విదేశాంగ శాఖ
Modi5

Modi5

ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సులో పాల్గొననున్నారు.

ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి జీన్-నోయెల్ బారోట్ గురువారం అబ్బే డెస్ వాక్స్-డి-సెర్నేలో జరిగిన జీ7 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌తో చర్చలు జరిపారు. ఈ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: UK-Russia: పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం

ఈ మంత్రుల సమావేశంలో మధ్యప్రాచ్యంలోని పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. హార్ముజ్ జలసంధిపై సంయుక్తంగా పని చేయడానికి సన్నిహిత సమన్వయ్యాన్ని కొనసాగించాలని భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం తెలిపింది. ఇక G7 కార్యకలాపాలకు భారతదేశం అందించిన సహకారాన్ని ఫ్రాన్స్ అభినందించింది.