UK-Russia: పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం
- పశ్చిమాసియాలో మరో ఘర్షణ
- రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం
- పుతిన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కీర్ స్టార్మర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వామ్మో.. పశ్చిమాసియా యుద్ధంతో ఇప్పటికే ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. యుద్ధ వార్తలు వింటేనే గుండె ఝళ్లుమంటోంది. ఇప్పటికే ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. సామాన్యుల జీవితాలు కూడా గందరగోళంగా మారాయి. దీంతో యుద్ధానికి ముగింపు పలకాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మరో రెండు దేశాల మధ్య ఘర్షణ మొదలయ్యేటట్టు కనిపిస్తోంది.
తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాన్ని చూసి పుతిన్ మురిసిపోతున్నారని.. చమురు ధరలు పెరిగితే తన జేబులు నింపుకోవచ్చని భావిస్తున్నారని మండిపడ్డారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని… తాను స్వదేశంలోనూ.. విదేశాల్లోనూ బ్రిటిష్ ప్రయోజనాలను ఎల్లప్పుడూ కాపాడుతానని శపథం చేశారు. ఈ సందర్భంగా రష్యా రహస్య నౌకాదళంపై చర్య తీసుకుంటానని తీవ్రంగా హెచ్చరించారు.
Also Read
- Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
రష్యాకు చెందిన ‘‘షాడో ఫ్లీ్ట్’’కు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించారు. ప్రాశ్చాత్య ఆంక్షలను ధిక్కరించి చమురు విక్రయిస్తున్న రష్యా నౌకలను అడ్డగించి.. స్వాధీనం చేసుకోవాలని బ్రిటిష్ సైన్యానికి కీర్ స్టార్మర్ ఆదేశించారు. నౌకల ద్వారా వచ్చే అక్రమ సొమ్మును ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధానికి పుతిన్ వాడుతున్నారని.. తక్షణమే దీన్ని ఆపాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన పాత, ప్రమాదకరమైన ట్యాంకర్లను స్వాధీనం చేసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధమైంది.
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్ తన సోషల్ మీడియాలో ఎక్స్‌లో రాసుకొచ్చారు. పెరుగుతున్న చమురు ధరలతో తన ఖజానా నింపుకోవడానికి సహాయపడుతున్నాయని పుతిన్ భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘పుతిన్ ఇప్పుడు ఆనందంతో చేతులు రుద్దుకుంటూ ఉండవచ్చు. కానీ మేము అతని రహస్య నౌకాదళంపై మరింత శక్తివంతంగా దాడి చేస్తాం. మా లక్ష్యం బ్రిటన్‌ను సురక్షితంగా ఉంచడం మాత్రమే కాదు.. ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న పుతిన్ యుద్ధ యంత్రాంగాన్ని కూడా ఆపుతాం’’ అని తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.
షాడో ఫ్లీట్..
షాడో ఫ్లీట్ (Shadow Fleet) లేదా డార్క్ ఫ్లీట్ అంటే అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకోవడానికి.. అక్రమంగా లేదా రహస్యంగా చమురు వంటి వస్తువులను రవాణా చేసే పాత ఆయిల్ ట్యాంకర్ల సమూహం. ఈ నౌకలు తమ గుర్తింపు, యజమాని, గమ్యస్థానాన్ని దాచిపెడతాయి. రష్యా, ఇరాన్, వెనిజులా వంటి దేశాలు తమపై ఉన్న ఆంక్షల నుంచి బయటపడి చమురును విక్రయించడానికి వీటిని ప్రధానంగా ఉపయోగిస్తున్నాయి. ఈ నౌకలు సాధారణంగా 15 ఏళ్ల కంటే పాతవి. సరిగ్గా నిర్వహించబడనివి. సరైన బీమా (Insurance) లేనివి. ఇవి ప్రమాదానికి గురైతే భారీ చమురు లీకేజీలు సంభవించి పర్యావరణానికి.. ముఖ్యంగా సముద్రం వంటి ప్రాంతాల్లో పెద్ద ముప్పు వాటిల్లుతుంది.
ఇప్పుడు రష్యా కూడా ‘‘షాడో ఫ్లీట్’’ అని పిలువబడే పాత, గుర్తుపట్టలేని ట్యాంకర్ల పెద్ద నెట్‌వర్క్ నడిపిస్తోంది. పాశ్చాత్య ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా తన ముడి చమురులో సుమారు 75 శాతం ప్రపంచవ్యాప్తంగా ఈ నౌకలను ఉపయోగించి రవాణా చేస్తోంది. ఈ నౌకలు ఆర్థిక నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా.. పర్యావరణానికి గణనీయమైన ముప్పును కలిగిస్తాయి. ఈ ట్యాంకర్లు ఎంత అధ్వాన్న స్థితిలో ఉన్నాయంటే.. అవి ఏ క్షణంలోనైనా సముద్రంలోకి చమురును లీక్ చేసి సముద్ర జీవులకు ప్రమాదం కలిగించగలవు. అంతటి పాత ట్యాంకర్లు అవి. ఈ నేపథ్యంలోనే యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంటామని రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామం మరో యుద్ధానికి దారి తీస్తుందా? లేదంటే రాజీ పడతారా? అన్నది తేలాల్సి ఉంది.
ట్రంప్ నిర్ణయం ఆందోళన
మరోవైపు ట్రంప్ నిర్ణయం కూడా గందరగోళం సృష్టిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు కొన్ని దేశాలకు ట్రంప్ ప్రభుత్వం 30 రోజులు మినహాయింపు ఇచ్చింది. ఈ పరిణామం రష్యాపై ఒత్తిడి తెస్తున్న ఐరోపా దేశాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అయితే ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ మార్కెట్‌ను చక్కదిద్దడానికి సహాయపడుతుందని ట్రంప్ భావించారు. కానీ ఐరోపా దేశాలకు మాత్రం పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. అయితే ఇంగ్లీష్ ఛానల్ గుండా తరచుగా ప్రయాణించే 544 రష్యా నౌకలను ఇప్పటికే బ్రిటన్ నిషేధించింది. ఇక రష్యా రహస్య నౌకలను స్వాధీనం చేసుకోవడంలో బ్రిటన్‌తో చేతులు కలపాలని కీర్ స్టార్మర్ ఇతర దేశాలకు కూడా విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Putin is rubbing his hands at the war in the Middle East because he thinks higher oil prices will let him line his pockets.
I will always defend British interests at home and abroad, which is why we are taking action against Russia’s shadow fleet today. pic.twitter.com/Ygttr9Tuui
— Keir Starmer (@Keir_Starmer) March 26, 2026
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!