NTV Telugu Site icon

PM Modi: ఫ్రాన్స్ పర్యటనకు మోడీ.. 11న ఏఐ సమ్మిట్‌లో పాల్గొననున్న ప్రధాని

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న పారిస్‌లో జరిగే ఏఐ సమ్మిట్‌కు మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు, చైనా ఉప ప్రధానమంత్రి పాల్గొననున్నారు. ఫ్రెంచ్ కంపెనీల అగ్రశేణి సీఈవోలతో కూడా ప్రధాని మోడీ చర్చలు జరపనున్నారు. ఫిబ్రవరి 12న మార్సెయిల్‌లో అధ్యక్షుడు మాక్రాన్‌తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

ఇది కూడా చదవండి: Shabbir Ali : అమెరికాతో మాట్లాడే దమ్ము కేంద్రానికి లేదు

ఏఐ సమ్మిట్‌కు అధ్యక్షత వహించాలని భారత్‌ను ఫ్రాన్స్ ఆహ్వానించింది. వారం రోజుల పాటు  ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రధాన వాటాదారులతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు మరియు చైనా ఉప ప్రధాన మంత్రి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఫ్రాన్స్‌లో మోడీ పర్యటించడం మోడీకి ఇది ఆరో పర్యటన కావడం విశేషం. ఇదిలా ఉంటే పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 12న ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్వహించే వీవీఐసీ విందుకు కూడా ప్రధాని మోడీ హాజరవుతారు.

ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: మహా కుంభమేళాలో సన్యాసం స్వీకరించిన మాజీ మిస్ ఇండియా..