NTV Telugu Site icon

PM Narendra Modi: యుద్ధం లేకపోవడం అంటే శాంతి కాదు.. పాకిస్తాన్‌కి పరోక్ష హెచ్చరికలు

Pm Modi

Pm Modi

PM Modi to address third ‘No Money for Terror’ meet: ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో భారత్ ఎప్పుడూ దృఢంగా వ్యవహరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘ నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సులో అన్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చేందుకు కొత్త ఆర్థిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారని అన్నారు. మేము వేలాది ప్రాణాలను కోల్పోయామని.. అయితే మేము ఉగ్రవాదాన్ని దృఢంగా ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. ఒక్క ఉగ్రదాని కూడా మేం తక్కువగా భావించడం లేదని అన్నారు. యూనిఫాం జీరో టాలరెన్స్ అప్రోచ్ కోసం పిలుపునిచ్చారు.

టెర్రర్ ఫైనాన్సింగ్, రిక్రూట్మెంట్ కోసం కొత్త తరం టెక్నాలజీని వినియోగిస్తున్నారని..ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కొన్ని సార్లు మనీలాండరింగ్, ఆర్థిక నేరాలు కూడా తీవ్రవాద నిధులకు సహాయపడుతున్నాయని అన్నారు. అటువంటి దేశాలు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు. టెర్రరిజాన్ని అడ్డుకునేందుకు ఐక్యరాజ్యసమితి, ఫైనాన్సియల్ యాక్షన్ ఫోర్స్( ఎఫ్ఏటీఎఫ్) సహాయం చేస్తున్నాయని అన్నారు.

Read Also: Twitter: ట్విట్టర్ ఉద్యోగుల రాజీనామా.. “నేనేం వర్రీ కావడం లేదంటున్న” మస్క్..

ఇదిలా ఉంటే టెర్రిరిజంపై పాకిస్తాన్ కు పరోక్షంగా హెచ్చరికలు పంపారు ప్రధాని నరేంద్రమోదీ. కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయని.. ఆ దేశాలు ఒంటరి చేయాలని అన్నారు. యుద్ధం లేకపోవడం అంటే శాంతి ఉందని కాదని అంతర్జాతీయ సంస్థలను ఉద్దేశించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. నకిలీ యుద్ధాలు కూడా ప్రమాదకరమైనవి, హింసాత్మకం అయినవని అన్నారు. ఉగ్రవాదంతో పోరాడటం, ఉగ్రవాదులతో పోరాటం చేయడం వేరని ఆయన అన్నారు. ఉగ్రవాదులను ఆయుధాలతో నేలకూల్చవచ్చని.. అయితే ఉగ్రవాదాన్ని అడ్డుకోవాలంటే పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించారు. ఉగ్రవాదం మా ఇళ్లలోకి వచ్చే వరకు మేము చూసుకుంటూ ఉండలేమని ప్రధాని పరోక్షంగా ఉగ్రవాదులను హెచ్చరించారు. గతంలో ఏప్రిల్ 2018లో పారిస్ లో, నవంబర్ 2019లో మెల్బోర్న్ లో రెండు సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో మూడో సమావేశం జరగుతోంది. ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలకు ఫండింగ్ నిలిపే విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Show comments