Site icon NTV Telugu

PM Modi: 1947లోనే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సింది.. సర్దార్ పటేల్ సలహాను పాటించలేదు..

Pmmodi

Pmmodi

PM Modi: దేశ విభజన జరిగిన 1947లో తొలి ఉగ్రవాద దాడిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిందని, ఇప్పుటికీ భారత్ ఈ ఉగ్రవాద వికృతరూపాన్ని అనుభవిస్తోందని గుజరాత్‌లో జరిగిన ఓ సభలో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మోడీ ఆరోపించారు. ‘‘1947లో భారత్ మూడు ముక్కలైంది. అదే రాత్రి గడ్డపై మొదటి కాశ్మీర్ గడ్డపై మొదటి ఉగ్రవాద దాడి జరిగింది. ఇండియాలోని ఒక భాగాన్ని పాకిస్తాన్ ‘ముజాహిదీన్’ పేరుతో బలవంతంగా ఆక్రమించింది. ఆ రోజే, ముజాహిదీన్లు అని పిలవబడే వారిని మృత్యు కూపంలో పడవేసి ఉండాల్సింది’’ అని మోడీ అన్నారు.

Read Also: Altroz Facelift: కొత్త టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ.. మైలేజీలో రారాజు..!

‘‘పీఓకేని తీసుకునే వరకు సైన్యం ఆగకూడదని పటేల్ కోరుకున్నారు. కానీ సర్దార్ సాహిబ్ మాటలు పట్టించుకోలేదు’’ అని చెప్పారు. ఈ ముజాహిదీన్ల రక్తపాతం గత75 ఏళ్లుగా కొనసాగుతోందని, పహల్గామ్ లో జరిగింది దీని రూపమే అని, భారత సైన్యం ప్రతీసారి పాకిస్తాన్‌ని ఓడించింది, భారత్‌పై గెలవలేమనే పాకిస్తాన్‌కి అర్థమైందని మోడీ అన్నారు. భారత్‌కి వ్యతిరేకంగా రాష్ట్రేతర శక్తులు నిర్వహిస్తున్నది ‘‘ప్రాక్సీ యుద్ధం కాదు’’ ఇది పాకిస్తాన్ బాగా ప్లాన్ చేసిన యుద్ధం అని ప్రధాని మోడీ అన్నారు.

అయితే, దీనిపై కాంగ్రెస్ ధీటుగా స్పందించింది. ప్రధాని మోడీకి చరిత్ర గురించి తెలియదని 1947లో ఆర్ఎస్ఎస్ పటేల్‌ని విమర్శించారని, సర్దార్ పటేల్, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ వంటి వారి దిష్టిబొమ్మల్ని తగులబెట్టారని ఖేరా అన్నారు.

Exit mobile version