Site icon NTV Telugu

PM Modi: పాక్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దమ్మేంటో చూపించారు

Modispech

Modispech

పాకిస్థాన్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దమ్మేంటో చూపించారంటూ ప్రధాని మోడీ వాయుసేనను ప్రశంసించారు. పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో వాయుసేనను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌లో సత్తా చూపించారంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడారు.

ఇది కూడా చదవండి:Pakistan: అవును, భారత్ మా ఎయిర్ బేస్‌లపై క్షిపణి దాడి చేసింది: పాకిస్తాన్ డిప్యూటీ పీఎం..

‘‘అణ్వాయుధాలను చూపి బ్లాక్‌మెయిల్ చేయాలనుకున్నారు. అణుబాంబు హెచ్చరికలను భారత వాయుసేన చిత్తు చిత్తు చేసింది. భారత వాయుసేన ప్రతిభను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. భవిష్యత్ తరాలకు మీరంతా ఆదర్శం. భారత్ మాతాకీ జై నినాదం శత్రువులకు నిద్ర లేకుండా చేసింది. చరిత్ర సృష్టించిన వాయుసేన వెంట దేశ ప్రజలంతా ఉన్నారు.’’ అని మోడీ తెలిపారు.

‘‘వాయుసేన ప్రతిభను చూసి ఉదయాన్నే మీ దగ్గరకు వచ్చేశాను. మన డ్రోన్స్, మిస్సైల్స్ దాయాది దేశానికి నిద్ర లేకుండా చేశాయి. శత్రువులకు మన సత్తా ఏంటో తెలిసింది. భవిష్యత్ తరాలకు మీరంతా ప్రేరణగా ఉంటారు. పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా శత్రువును చావు దెబ్బకొట్టారు. మళ్లీ ఉగ్ర దాడి జరిగితే కచ్చితంగా భారత్ సరైన సమాధానం చెబుతుంది.’’ అని మోడీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Pakistan: అవును, భారత్ మా ఎయిర్ బేస్‌లపై క్షిపణి దాడి చేసింది: పాకిస్తాన్ డిప్యూటీ పీఎం..

Exit mobile version