Site icon NTV Telugu

PM Modi: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి ప్రధాని నరేంద్రమోడీ ఫోన్..

Pm Modi, Zelensky

Pm Modi, Zelensky

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలన్స్కీకి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌కి ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత ప్రధాని జెలన్‌స్కీతో సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్-ఉక్రెయిన్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి కోసం కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు తీసుకురావడానికి మద్దతు ఇస్తుందని ప్రధాని, జెలన్స్కీకి తెలియజేశారు. భారతదేశం మానవతా సాయం కొనసాగిస్తుందని ఆయన చెప్పారు.

Read Also: PM Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ప్రధాని మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?

చర్యలు, దౌత్యంతో ఇరు దేశాలు ముందుకు వెళ్లాని ప్రధాని పునరుద్ఘాటించారు. ఇరు దేశాలు సమస్యను త్వరగా, శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని ప్రధాని గతం నుంచి తెలియజేస్తున్నారు. ఉక్రెయిన్ ప్రజల కోసం భారత్ చేస్తున్న మానవతా సాయాన్ని జెలెన్స్కీ ప్రశంసించారు. ఇరు దేశాధినేతలు నిరంతరం టచ్‌లో ఉండేందుకు అంగీకరించారు. పుతిన్ మళ్లీ రష్యా దేశాధ్యక్షుడు కావడంతో మరోమారు ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రమయ్యే అవకాశం ఉన్న ఈ సమయంలో ప్రధాని మోడీ ఇటు పుతిన్, అటు జెలెన్స్కీలతో సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది మేలో జపాన్ హిరోషిమాలో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని నరేంద్రమోడీతో జెలెన్స్కీ భేటీ అయ్యారు.

ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్-రష్యా మధ్య ప్రత్యే, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాల నేతలు అంగీకరించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. వెస్ట్రన్ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. మరోవైపు ఇరు దేశాలు కూడా చర్యలు, దౌత్యమార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచిస్తోంది.

Exit mobile version