Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
- నేపాల్ ప్రధాని బాలెన్ షాకు ప్రధాని మోడీ ఫోన్..
- వరదలపై సాయం అందిస్తామని హామీ..
- నేపాల్ వరదలతో బీహార్, యూపీలు హై అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్‌లో భోటేకోశి నది పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిన మెరుపు వరద నేపాల్‌లోనే ఊర్లకుఊర్లను కబలించింది. వందలాది మంది గల్లంతయ్యారు. 100కు పైగా భారతీయులు కూడా గల్లంతైనట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, భారత్‌లో కూడా వరద ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీహార్, యూపీల్లో కోసి, గండక్ నదుల్లో ప్రవాహాలు పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
ఇదిలా ఉంటే, నేపాల్ వరద విధ్వంసంపై ఆ దేశ ప్రధాని బాలెన్ షాకు, భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేశారు. నేపాల్‌లో వరదల కారణంగా జరిగిన ప్రాణనష్టం పట్ల సంతాపం తెలిపారు. నేపాల్‌కు సాధ్యమైనంత మానవతా సహాయం, సహాయక మద్దతు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. భారత్ కాఠ్మాండులో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
Also Read
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
నేపాల్‌లో వరదల వల్ల జరిగిన విధ్వంసం ఆందోళనకరంగా ఉందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గండక్, నారాయణి నదులలో నీటిమట్టాలు పెరిగే అవకాశం ఉన్నందున, మహారాజ్‌గంజ్, కుషినగర్‌లోని స్థానిక యంత్రాంగాలను అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అధికారులను ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. బీహార్‌లోని ఆరు జిల్లాలకు పలు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను పంపారు. కోసి, గండక్ నదీ పరివాహక ప్రాంతాలలో నీటిమట్టాలు పెరిగే అవకాశం ఉన్నందున యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
తాజావార్తలు
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!