PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్‌మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్

  • సరికొత్త రికార్డ్ సృష్టించిన మోడీ
  • పన్నెండేళ్ల పాటు ఏకధాటిగా పాలించిన నేతగా చరిత్ర
  • ఎన్డీఏ నేతలకు ఝుల్‌మురి తినిపించిన మోడీ
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Modi

Modi

ప్రధానిగా మోడీ దేశ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఏకధాటిగా దేశాన్ని పన్నెండేళ్ల పాటు పాలించిన నేతగా మోడీ చరిత్ర సృష్టించారు. దీంతో దేశ నాయకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నాయకుల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఇక బుధవారం సాయంత్రం ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీఏ (NDA) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోడీని నాయకులంతా అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఝుల్‌మురి రుచిచూశారు. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి స్వయంగా ఝుల్‌మురి అందించారు. అనంతరం నాయకులకు మోడీ స్వయంగా అందించారు. అందరితో కలిసి తింటూ ఆస్వాదించారు.

ఝుల్‌మురి ప్రత్యేక ఇదే


పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో ఝుల్‌మురి ఎంత ప్రత్యేకమైందో తెలిసింది. ప్రచారంలో భాగంగా మోడీ షాపు దగ్గరకు వెళ్లి డబ్బులిచ్చి ఝుల్‌మురి తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో కూడా మరోసారి రుచిచూశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

×
×
Ad

భారత్ మండపంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అగ్రనేతలు పాల్గొన్నారు. రాబోయే రాజకీయ వ్యూహాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి బలోపేతంపై సమావేశంలో చర్చలు జరిగినట్లు సమాచారం.