ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్ పర్యటన మధ్యలోనే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి రావడం పెద్ద రచ్చగా మారింది.. ఈ వ్యవహారం ఏకంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టింది.. భద్రతా లోపాల కారణంగా పంజాబ్పర్యటనను ప్రధాని మోడీ ఆకస్మికంగా ముగించిన వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌వేశారు సీనియర్అడ్వకేట్మణిందర్ సింగ్.. ఈ వ్యవమారంలో కేంద్ర ప్రభుత్వం పాటు పంజాబా్ సర్కార్‌కు నోటీసులు వెళ్లగా.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ఎన్వీ రమణ రేపు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నారు.
Read Also: ఎమ్మెల్యే వనమాను సస్పెండ్ చేయాలి.. రాఘవను అరెస్ట్ చేయాలి..!
మరోవైపు, ప్రధాని నరేంద్రమోడీ ఫిరోజ్‌పుర్ పర్యటన సందర్భంగా ఏర్పడిన భద్రతా లోపాలపై పంజాబ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మెహ్‌తాబ్, న్యాయ, హోంశాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి అనురాగ్‌వర్మతో కూడిన ఈ కమిటీ.. ప్రధాని పర్యటన, ఎదురైన సవాళ్లు, భద్రతా లోపాలు.. తదితర అంశాలపై అధ్యయనం చేయనుంది.. ఈ కమిటీ 3 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. కాగా, నిన్న పంజాబ్ పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ.. కొన్ని నాటకీయ పరిణామాలతో ఆయన ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.. దీంతో, ఫిరోజ్పుర్లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దు చేశారు.. ప్రధాని మోడీ పంజాబ్‌లో అడుగుపెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే వెనుదిరిగి ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి మన్సుఖ్మాండవీయ.. కొన్ని కారణాల వల్ల సభకు ప్రధాని మోడీ హాజరు కావడం లేదంటతూ సభా వేదికపై నుంచి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, ఈ వ్యవహారంలో పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు విచారణ ఆసక్తికరంగా మారింది.
