ఎమ్మెల్యే వనమాను సస్పెండ్‌ చేయాలి.. రాఘవను అరెస్ట్‌ చేయాలి..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.. ఇక, తన ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది.. తన కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవయే కారణమనేది రామకృష్ణ చేసిన ప్రధాన ఆరోపణ.. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని.. కానీ, ఏ భర్త కూడా వినగూడని మాట వనమా రాఘవ అడిగారు.. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగాడని.. ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు టి.పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి.

Read Also: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్.. సెల్ఫీ వీడియోతో సంచలనం..!

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ తన భార్యను పంపమని ఆదేశించాడని మృతుడు రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు.. ఈ దారుణాన్ని తట్టుకోలేక రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడన్న రేవంత్‌రెడ్డి.. రామకృష్ణ యొక్క ఆశ్చర్యకరమైన చివరి సెల్ఫీ వీడియో వనమా రాఘవేంద్ర S/O కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రావు యొక్క దౌర్జన్యాలను వెల్లడిస్తుందన్నారు. ఈ కేసులో వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు రేవంత్‌ రెడ్డి. ఒక కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నా.. ఇప్పటి వరకు అధికార పార్టీ స్పందించకపోవడం దారుణమైన విషయమని మండిపడ్డ ఆయన.. కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించిన రేవంత్‌.. ఈ ఘటనపై కేసీఆర్‌ వెంటనే స్పందించాలని.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రేవంత్‌ రెడ్డి.

Related Articles

Latest Articles