Site icon NTV Telugu

PM Modi 91st Mann Ki Baat: ఆగస్టు 15 వరకు జాతీయ జెండాను మీ..డీపీగా మార్చుకోండి

Modi Man Ki Baat

Modi Man Ki Baat

ప్రతిఒక్కరు తమ ప్రొఫైల్‌ పిక్చర్‌గా మువ్వన్నెల జెండా పెట్టుకోవాలని ప్రధానమంత్రి మోడీ దేశ ప్రజలకు సూచించారు. మన్ కీ బాత్ కార్యక్రమం 91వ ఎడిషన్ లో మాట్లాడుతూ మోడీ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు వివిధ సోషల్‌ మీడియాల్లో తమ ప్రొఫైల్‌ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో..75 ఏళ్ల స్వాతంత్యానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోదుల పేర్లు పెట్టినట్లు గుర్తు చేశారు. అటువంటి స్టేషన్లను పిల్లలు సందర్శించాలని మోడీ సూచించారు.

read also: Pakistan: ఫుట్ బాల్ స్టేడియం వెలుపల బాంబ్ బ్లాస్ట్..

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షాహీద్‌ ఉద్ధమ్‌ సింగ్‌ జీ కి సంతాపం తెలుపుతున్నామన్నారు. కాగా.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవం ఒక ఉద్యమంగా సాగుతుండటం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములై ఆగస్టు 2-15 వరకు తమ ప్రొఫైల్‌ పిక్చర్‌గా మువ్వన్నెల జెండాను పెట్టుకోవాలని పిలుపు నిచ్చారు. అంతే కాకుండా.. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగ కార్యక్రమం ఉంటుందని, మీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రజలను కోరారు. ఈనేపథ్యంలో.. హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతున్న మిజార్‌ మేళాను వీలైతే సందర్శించాలని ప్రధాని మోడీ కోరారు. ఇక పీవీ సింధూ, నీరజ్‌ చోప్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. మరోవైపు యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతోన్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు గొప్ప ఆట తీరును ప్రదర్శించాలని ఆకాక్షించారు.
Kishan Reddy: ఢిల్లోలో పింగళి వెంకయ్య ఫొటోతో‌ పోస్టల్ స్టాంపులు..

Exit mobile version