Site icon NTV Telugu

PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం.. ఈయూ డీల్‌ను మరోసారి ప్రశంసించిన మోడీ

Modi

Modi

కేంద్ర బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి అని ప్రధాని మోడీ అన్నారు. పార్లమెంట్ భవన్ ముందు మోడీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని చెప్పారు. పార్లమెంట్ సభ్యులకు రాష్ట్రపతి ఎన్నో విలువైన సూచనలు ఇచ్చారని.. రాష్ట్రపతి వ్యాఖ్యలను సభ్యులంతా పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆకాంక్షించారు.

భారత్- ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ యువతకు ఎన్నో అవకాశాలు కల్పించనుందని.. అంతేకాకుండా ఉత్పత్తి రంగానికి మరింత ఊపునివ్వనుందని మోడీ పేర్కొ్న్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ మరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారని.. ఇది భారత పార్లమెంట్ చరిత్రలో అరుదైన గౌరవం అని.. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారనుందని తెలిపారు.

‘‘దేశ అభివృద్ధి కోసం కీలక సంస్కరణలతో ముందుకు పోతున్నాం. నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో ప్రతి భారతీయుడి ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబించింది. 140 కోట్ల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించింది. 2047 వికసిత్ భారత లక్ష్యం కోసం కార్యాచరణ ప్రారంభం అయింది. దేశ చరిత్రలో నిర్మలా సీతారామన్ మహిళ ఆర్థిక మంత్రిగా.. తొమ్మిదవ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. పార్లమెంట్ చరిత్రలో నిలిచిపోతుంది. ప్రపంచానికి భారత్ ఆశా కిరణంగా మారింది. భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య జరిగిన ఒప్పందం.. మరింత మేలు జరగనుంది. దీర్ఘకాలిక లబ్ధి చేకూరనుంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుని. దీర్ఘకాలిక పరిష్కారాలతో ముందుకు పోతున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకుంటున్న నిర్ణయాలతో సామర్థ్యతను ప్రపంచానికి చాటిచెబుతున్నాం. అన్ని అంశాలకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. బలంగా సమాధానం చెబుతున్నాం. వికసిత్ భారత్ కోసం సభ్యులంతా పనిచేయాలి.’’ అని మోడీ ఆకాంక్షించారు.

 

Exit mobile version