Site icon NTV Telugu

PM Modi: ఆ పాలనను 5 పదాల్లో చెప్పొచ్చు.. విపక్ష కూటమిపై మోడీ విసుర్లు

Pmmodi

Pmmodi

బీహార్‌లో ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. సమయం దగ్గర పడడంతో నాయకులు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇక అధికార-విపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న రాహుల్ గాంధీ.. మోడీ లక్ష్యంగా విమర్శలు చేయగా.. ఈరోజు ప్రధాని మోడీ.. విపక్ష కూటమి టార్గెట్‌గా ధ్వజమెత్తారు.

గురవారం ముజఫర్‌పూర్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనను ఐదు పదాల్లో చెప్పొచ్చన్నారు. ‘‘కట్ట, క్రోర్తా, కటుటా, కుషాసన్, అవినీతి’’ అని పిలిచారు. కట్టా (నాటు తుపాకీ), క్రోర్తా (క్రూరత్వం), కటుటా (దురుద్దేశం), కుషాసన్ (సుపరిపాలన లేకపోవడం), కరప్షన్‌ (అవినీతి).. ఇవే ఆ రెండు పార్టీల విధానాలు అని వివరించారు. ఆర్జేడీ అధికారంలో ఉన్న సమయంలో షోరూంలో నుంచి వాహనాలను దోచుకెళ్లారని.. అలాగే 35 వేల నుంచి 40 వేల వరకు కిడ్నాప్‌ కేసులు నమోదయ్యాయని వివరించారు.

ఇది కూడా చదవండి: Maharashtra: ట్రంప్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు.. ఎమ్మెల్యేపై కేసు

ప్రతి సర్వే ఏం చెబుతున్నాయంటే.. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి అతి పెద్ద ఓటమిని చూడబోతున్నాయని.. ఎన్డీఏ కూటమి మాత్రం అతిపెద్ద విజయాన్ని సాధించబోతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. కొత్త చరిత్రను బీహార్ యువత, బీహార్ మహిళలు, బీహార్ రైతులు, బీహార్ మత్స్యకారులు సృష్టించబోతున్నారని పేర్కొన్నారు. విపక్ష కూటమి మేనిఫెస్టోలో అబద్ధాలు తప్ప మరేమీ లేవన్నారు. మేనిఫెస్టోను చూసి వారి మద్దతుదారులే నమ్మలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. బీహార్ యువత కూడా సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తున్నారన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ సభ్యులు బీహార్ ప్రజల మేధో సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Mumbai: ముంబైలో నకిలీ శాస్త్రవేత్త అరెస్ట్.. అణు డేటా ఉన్నట్లుగా అనుమానాలు!

ఇదిలా ఉంటే బుధవారం ఉదయం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ‘ఓట్ల కోసం ఏదైనా చేస్తారని’’ ఆరోపిస్తూ రాజకీయ వివాదానికి తెరలేపారు. ‘‘ఆయన (ప్రధాని మోడీ) మీ ఓటును మాత్రమే కోరుకుంటున్నారు. మీరు ఓట్ల కోసం డ్రామా చేయమని అడిగితే ఆయన అలా చేస్తారు. మీరు ఆయనను ఏదైనా చేయమని బలవంతం చేయవచ్చు. మీరు నరేంద్ర మోడీని డాన్స్ చేయమని చెబితే ఆయన డాన్స్ చేస్తాడు.’’ అని అన్నారు. ‘‘వారు మీ ఓట్లను దొంగిలించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఎన్నికల దోపిడీని అంతం చేయాలనుకుంటున్నందున నేను మీకు చెప్తున్నాను. వారు మహారాష్ట్రలో దొంగిలించారు. అటు తర్వాత హర్యానాలో దొంగిలించారు. ఇప్పుడు వారు బీహార్‌లో తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు.’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.

రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది. ఒకరేమో అధికారం నిలబెట్టుకునేందుకు.. ఇంకొకరు అధికారం కోసం పోరాడుతున్నారు.

Exit mobile version