Site icon NTV Telugu

Putin: మోడీ కోసం పుతిన్ వెయిటింగ్.. ఇది కదా భారత్-రష్యా స్నేహం..

Putin Modi

Putin Modi

Putin: చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న 25వ షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత మోడీ, చైనాలో పర్యటిస్తున్నారు. ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాల తర్వాత, ఈ సమావేశం జరుగుతుండటంతో ప్రపంచ దృష్టి అంతా ఈ సమావేశాలపైనే ఉంది. ఇదిలా ఉంటే, ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ సన్నివేశం భారత్, రష్యాల మధ్య స్నేహానికి నిదర్శనంగా మారింది.

Read Also: Sexual Harassment: యూపీలో ఘోరం.. స్టూడెంట్‌‌పై స్కూల్ ప్రిన్సిపాల్ లైంగిక దాడి..

దీని తర్వాత, ప్రధాని మోడీ ఎక్స్‌లో ఈ ప్రయాణం గురించి రాశారు. ‘‘SCO శిఖరాగ్ర సమావేశ వేదిక వద్ద జరిగిన కార్యక్రమాల తర్వాత, అధ్యక్షుడు పుతిన్ మరియు నేను కలిసి మా ద్వైపాక్షిక సమావేశ వేదికకు ప్రయాణించాము. ఆయనతో సంభాషణలు ఎల్లప్పుడూ అంతర్దృష్టితో కూడుకున్నవి’’ అని ట్వీట్ చేశారు.

SCO శిఖరాగ్ర సమావేశ వేదిక నుండి రిట్జ్-కార్ల్టన్ హోటల్‌కు ప్రధాని మోదీతో పాటు ప్రయాణించాలని అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేకంగా కోరుకున్నారని తెలిసింది. ఇందు కోసం పుతిన్ స్వయంగా ప్రధాని మోడీ కోసం దాదాపుగా 10 నిమిషాలు వేచి చూశారు, చైనా నుంచి పుతిన్‌కి గిఫ్ట్‌గా వచ్చిన ఆరస్ సెడాన్ కారులో కలిసి ప్రయాణించారు. పుతిన్, మోడీ మధ్య స్నేహంపై అంతర్జాతీయ మీడియా విస్తృత కవరేజ్ ఇచ్చింది. వీరిద్దరి మధ్య చర్చలు, పలకరింపులకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇది కాదా భారత్-రష్యాల మధ్య స్నేహం అంటే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు నేతలు కారు ప్రయాణంలోనే కాకుండా, ద్వైపాక్షిక సమావేశంలో 45 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి.

Exit mobile version