NTV Telugu Site icon

PM Modi: ఆర్ఎస్ఎస్ ఆధునిక అక్షయ వటవృక్షం

Modi

Modi

ఆర్ఎస్ఎస్ అనేది భారతీయ సజీవ సంస్కృతికి ఆధునిక అక్షయ వటవృక్షమని ప్రధాని మోడీ అభివర్ణించారు. ప్రధాని మోడీ ఆదివారం నాగ్‌పుర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. భారతీయ సంస్కృతికి, ఆధునికీకరణకు ఆర్‌ఎస్ఎస్ మర్రిచెట్టులాంటిదన్నారు. మహాకుంభమేళాలో సంఘ్ కార్యకర్తలు వివిధ రంగాల్లో నిస్వార్థంగా పని చేశారని ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్ చేసిన తపస్సు కారణంగానే నేడు దేశం వికసిత్ భారత్ దిశగా సాగుతూ మంచి ఫలాలు ఇస్తుందన్నారు.

ఇది కూడా చదవండి: SRH vs DC: 5 వికెట్లతో మెరిసిన మిచెల్ స్టార్క్.. 163 పరుగులకే ఎస్‌ఆర్‌హెచ్ ఆలౌట్

దేశ ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ విధానమని మోడీ చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్యసేవలు అందుతున్నాయని తెలిపారు. ఇక జనరిక్ ఔషధ కేంద్రాల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు చౌకగా మందులు లభిస్తున్నాయని చెప్పారు. దీంతో వేల కోట్లలో ప్రజల సొమ్ము ఆదా అవుతోందని తెలిపారు. ఎయిమ్స్‌ను మూడు రెట్లు పెంచామని.. నిపుణులైన వైద్యలను ప్రజలకు అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని మోడీ పేర్కొన్నారు.