PM Modi: ఢిల్లీ కేథడ్రల్ చర్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మోడీ.. ఎక్స్‌లో ఫొటోలు పోస్ట్

  • క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ
  • ఢిల్లీలోని కెథడ్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనాలు
  • ఎక్స్‌లో ఫొటోలు పోస్ట్ చేసిన మోడీ
Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ది కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సభ్యులతో పాటే కొద్ది సేపు కూర్చున్నారు. అనంతరం పాటల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సేవ ప్రేమ, శాంతి, కరుణ సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. క్రిస్మస్ స్ఫూర్తి మన సమాజంలో సామరస్యం, సద్భావనను ప్రేరేపిస్తోందని పేర్కొన్నారు. అంతక ముందు ఎక్స్‌లో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసుక్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని బలపరుస్తాయని తెలిపారు.