Heeraben Modi Birthday: శతవసంతంలోకి ప్రధాని తల్లి.. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశానికి ప్రధానైనా తల్లికి కొడుకే..! అందుకే ప్రభుత్వ, రాజకీయా కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ వీలు చేసుకొని తన తల్లిని కలుస్తుంటారు ప్రధాని మోదీ. గుజరాత్‌కు వెళ్లి ఆమెతో గడుపుతుంటారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ వందో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. గుజరాత్ పర్యటనలోనే ఉన్న మోదీ.. గాంధీనగర్‌లోని తన నివాసంలో ఉన్న తల్లిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు మోదీ. తన తల్లికి అంకితం చేస్తూ.. ఓ బ్లాగ్ రాశారు. అమ్మ గొప్పతనం గురించి వివరిస్తూ.. అమ్మ అంటే ఒక్క పదం కాదని.. ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నదని అందులో వివరించారు.
ఆమెకు మిఠాయి తినిపించిన ప్రధాని.. కాసేపు సరదాగా గడిపారు. హీరాబెన్ మోదీ కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లి హీరాబెన్ చిరకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుతూ.. మోదీ స్వస్థలమైన వాద్‌నగర్‌లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 1923 జూన్ 18న ఆమె జన్మించారు. ప్రధాని మోదీ సోదరుడైన పంకజ్ మోదీతో కలిసి ఆమె అక్కడే నివాసం ఉంటున్నారు.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
హీరాబెన్ మోదీ పుట్టిన రోజు సందర్భంగా వాద్‌నగర్‌లోని హటకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు పావగఢ్‌లోని కాళీమాత ఆలయంలో జరిగే పూజల్లోనూ మోదీ పాల్గొంటారని సమాచారం. తల్లి శత వసంత పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని గాంధీనగర్‌లోని రైసన్ పెట్రోల్ పంపు నుంచి 60 మీటర్ల రోడ్డుకు ‘పూజ్య హీరా మార్గ్’ అని నామకరణం చేస్తారని సమాచారం.
Maa…this isn’t a mere word but it captures a range of emotions. Today, 18th June is the day my Mother Heeraba enters her 100th year. On this special day, I have penned a few thoughts expressing joy and gratitude. https://t.co/KnhBmUp2se
— Narendra Modi (@narendramodi) June 18, 2022
Took blessings of my mother today as she enters her 100th year… pic.twitter.com/lTEVGcyzdX
— Narendra Modi (@narendramodi) June 18, 2022
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!