Site icon NTV Telugu

Heeraben Modi Birthday: శతవసంతంలోకి ప్రధాని తల్లి.. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

Modi

Modi

దేశానికి ప్రధానైనా తల్లికి కొడుకే..! అందుకే ప్రభుత్వ, రాజకీయా కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ వీలు చేసుకొని తన తల్లిని కలుస్తుంటారు ప్రధాని మోదీ. గుజరాత్‌కు వెళ్లి ఆమెతో గడుపుతుంటారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్​ మోదీ వందో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. గుజరాత్​ పర్యటనలోనే ఉన్న మోదీ.. గాంధీనగర్‌లోని తన నివాసంలో ఉన్న తల్లిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.  100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు ట్వీట్​ చేశారు మోదీ. తన తల్లికి అంకితం చేస్తూ.. ఓ బ్లాగ్​ రాశారు. అమ్మ గొప్పతనం గురించి వివరిస్తూ.. అమ్మ అంటే ఒక్క పదం కాదని.. ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నదని అందులో వివరించారు.

ఆమెకు మిఠాయి తినిపించిన ప్రధాని.. కాసేపు సరదాగా గడిపారు. హీరాబెన్​ మోదీ కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లి హీరాబెన్‌ చిరకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుతూ.. మోదీ స్వస్థలమైన వాద్‌నగర్‌లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 1923 జూన్‌ 18న ఆమె జన్మించారు. ప్రధాని మోదీ సోదరుడైన పంకజ్ మోదీతో కలిసి ఆమె అక్కడే నివాసం ఉంటున్నారు.

Agnipath Scheme: అసలు అగ్నిపథ్ స్కీమ్ ఏంటి..?

హీరాబెన్ మోదీ పుట్టిన రోజు సందర్భంగా వాద్‌నగర్‌లోని హటకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు పావగఢ్‌లోని కాళీమాత ఆలయంలో జరిగే పూజల్లోనూ మోదీ పాల్గొంటారని సమాచారం. తల్లి శత వసంత పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని గాంధీనగర్‌లోని రైసన్ పెట్రోల్ పంపు నుంచి 60 మీటర్ల రోడ్డుకు ‘పూజ్య హీరా మార్గ్’ అని నామకరణం చేస్తారని సమాచారం.

Exit mobile version