Site icon NTV Telugu

PM Modi: ప్రధాని మోడీతో త్రివిధ దళాధిపతుల సమావేశం.. రేపటి భేటీపై చర్చ!

Modi

Modi

PM Modi: ఆపరేషన్‌ సింధూర్‌కు విరామం ఇచ్చిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో హైలెవల్‌ సెక్యూరిటీ సమావేశం కొనసాగుతుంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ (సీడీఎస్‌) అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ మీటింగ్ కు హాజరయ్యారు.

Read Also: Tollywood : మేమంటే మేము అన్నారు.. మిడ్ రేంజ్ సినిమాకు సైడ్ ఇచ్చారు

అయితే, భారత్‌-పాకిస్తాన్ లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడంతో.. ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్‌ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం గమనార్హం. కాగా, తటస్థ వేదికపై ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు.. సరిహద్దుల్లో పరిస్థితి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. తాజా పరిస్థితులపై మరి కొద్దిసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణశాఖ మీడియా సమావేశం నిర్వహించనున్నాయి.

Exit mobile version