నిన్నటి వరకు మే 30న మేము వస్తున్నాం.. అంటే మేము వస్తున్నాం అన్నారు. ఒకయన ఆ డేట్ కోసం ఏకంగా ముంబై లో మకాం వేసాడు. అందులో ముందుగా విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కింగ్డమ్. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన గ్లిమ్స్, సాంగ్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. మే 30న రిలీజ్ అని పోస్టర్ కూడా వేశారు.
Also Read : VishwakSen : ‘కల్ట్’ చూపిస్తానంటోన్న విశ్వక్ సేన్..
మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా మే30న రిలీజ్ చేసేందుకు నిర్మాత చాలా ప్రయత్నించారు. అందుకోసం నిర్మాత ఏఎం రత్నం ఆ సినిమా డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిన అమెజాన్ తో సంప్రదింపులు జరిపారు. కాని అందుకు అమెజాన్ ససేమీరా ఒప్పుకోకపోవడంతో మరోసారి ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పటికే రిలీజ్ డేట్ 11 సార్లు వాయిదా పడి ఓ రికార్డు సృష్టిస్తే మరో సారి పోస్ట్ పోన్ అయింది హరి హర వీరమల్లు. ఇప్పడు ఈ రెండు సినిమాలు మే 30న రిలీజ్ రావడంలేదని సమాచారం. ఇప్పుడు ఆ డేట్ ను లాక్ చేసుకుంది భైరవం. నారా రోహిత్, బెల్లం కొండ శ్రీనివాస్, మంచు మనోజ్ కాంబోలో వస్తున్న భైరవం తమిళ సినిమా గరుడన్ కు అఫీషియల్ రీమేక్. ఎప్పుడో షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ కాని కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తు మొత్తానికి మే 30న రిలీజ్ ను లాక్ చేసుకుంది. ఇలా రెండు పెద్ద సినిమాలు మేమంటే మేము అనుకుని చివరికి ఓ మిడ్ రేంజ్ సినిమాకు లైన్ ఇచ్చారు.