Minister Suresh Khade: మోదీ ఈ దేశానికి ఆత్మ.. ఎప్పుడూ ఓడిపోడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Is The Soul Of India Says Maharashtra Minister Suresh Khade : ప్రధాని నరేంద్రమోదీ మన భారతదేశానికి ఆత్మ లాంటి వారని, ఆయన ఎప్పటికీ ఓడిపోడు అంటూ మహారాష్ట్ర మంత్రి సురేశ్ ఖాడే వ్యాఖ్యానించారు. మోదీ అత్యంత శక్తివంతమైన నాయకుడని కొనియాడారు. ఆనాటి ప్రధానమంత్రులైన అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇందిరా గాంధీ సైతం ఓటములు చవిచూశారని.. కానీ మోదీ ఎప్పటికీ ఓడిపోరని అన్నారు. చివరికి భారతీయ జనతా పార్టీ అధిపతి అయిన ఎల్కే అద్వానీ సైతం ఎన్నికల్లో ఓడారని చెప్పారు. కానీ, ఇందులో వాస్తవం లేదు. ఎందుకంటే.. 1977 నుంచి 2014 వరకు అద్వానీ ప్రతి లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు.
అయినా.. మంత్రి సురేశ్ ఖాడే ఉన్నట్టుండి మోదీపై ఇంతలా ప్రశంసల వర్షం కురిపించడానికి కారణం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత జయంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలే! బారామతి ప్రాంతంలో శరద్ పవార్, ఆయన బంధువుని ఓడించడం అసాధ్యమని ఆయన ముంబైకి 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంధార్పూర్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఆ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాక సూర్యుడు ఉదయించొచ్చేమో గానీ.. బారామతి గడ్డపై పవార్స్కు రాజకీయ ఓటమి అనేది ఉండదని బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే.. మోదీ బారతదేశానికి ఆత్మ అని, ఆయన ఏ ఎన్నికల్లోనూ ఓడిపోడని సురేశ్ ఖాడే అన్నారు. ఇతరుల మాదిరిగానే ప్రజల ఓట్ల దయతో ప్రధాని మోదీ ఉన్నారని చెప్తే.. ఆయన ప్రజల మనసుల్లో ఉన్నారని ఆ మంత్రి బదులిచ్చారు.
Also Read
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్‌పై గడ్కరీ..
- Trump-Iran: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
కాగా.. ఇందిరా గాంధీ 1977లో లోక్‌సభ ఎన్నికల్లో ఓడారు. అటల్ బిహారీ వాజ్‌పేయి 1955లో బైపోల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 1957లో రెండు సీట్లలో పోటీ చేయగా, ఒక స్థానంలో పరాజయం పొందారు. అనంతరం 1962, 1984 ఆయన ఓటమి చవిచూశారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!