Site icon NTV Telugu

PM Modi: బంగ్లా నుంచి ప్రధాని మోడీకి ఆహ్వానం.. వెళ్లే అవకాశాలు తక్కువే..

Modi

Modi

PM Modi: బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా ఈ నెల 17న తారిఖ్ రెహ్మాన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జరిగి ఆ దేశ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అఖండ విజయం సాధించింది. రెండేళ్ల అనిశ్చితి తర్వాత, ఆ దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇదిలా ఉంటే, తారిఖ్ ప్రమాణస్వీకారానికి దక్షిణాసియా దేశాలతో పాటు గల్ఫ్ దేశాలకు ఆహ్వానం అందింది.

Read Also: Kakinada Road Accident: గూగుల్ మ్యాప్‌లో షాట్ కట్ రూట్‌తో ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి

ప్రధాని నరేంద్రమోడీని ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా ఢాకా అధికారికంగా ఆహ్వానం పలికింది. బంగ్లాదేశ్ పార్లమెంట్ హౌస్‌లోని సదరన్ ప్లాజాలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు మంత్రివర్గం కూడా ప్రమాణస్వీకారం చేస్తుందని తెలుస్తోంది.తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి 13 దేశాల ప్రభుత్వాధినేతలను ఆహ్వానించారు. ఆహ్వానితుల జాబితాలో భారతదేశం, చైనా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, మలేషియా, బ్రూనై, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు,భూటాన్ ఉన్నాయి.

ఇదిలా ఉంటే, ఈ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ హాజరుకాలేదరని తెలుస్తోంది. ఇప్పటికే, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పర్యటన ఖరారు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రధాని మోడీ స్థానంలో కేంద్రమంత్రుల్లో ఒకరు, భారత ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. యూనస్ పరిపాలన కాలంలో భారత్ బంగ్లా సంబంధాలు చిక్కుల్లో పడ్డాయి. యూనస్ పాక్ అనుకూల, భారత వ్యతిరేక విధానాల వల్ల రెండు దేశాల మధ్య దౌత్య ఘర్షణ ఏర్పడింది. ఇప్పుడు, తారిఖ్ రెహ్మాన్ పాలనతో సంబంధాలు గాడిన పడే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version