PM Modi: ప్రధాని నరేంద్రమోడీ జూలై 6 నుంచి మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇండోనేషియా బయలుదేరుతున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా ‘‘బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్’’ ఒప్పందమే కీలకంగా మారనుంది. ఈ క్షిపణి వ్యవస్థను దశలవారీగా కొనుగోలు చేసే విషయంపై భారత్-ఇండోనేషియా మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ిరు దేశాల సంబంధాల్లో ఈ ఒప్పందం మైలురాయిగా భావిస్తున్నారు.
మార్చిలో ఖరారు చేసిన ప్రాథమిక సింగిల్-సిస్టమ్ ఒప్పందానికి మించి ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి చర్చల్లో్ తీరప్రాంత మొబైల్ లాంచర్లు, రాడార్లు, శిక్షణ, నిర్వహణ, సమగ్ర సహాయ ప్యాకేజీ వంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఇండోనేషియాకు క్షిపణి మాత్రమే కాకుండా దాని పూర్తి భద్రత, నిర్వహణ వ్యవస్థల్ని కూడా అప్పగించనున్నారు.
ఇండో-పసిఫిక్‌కు కీలకం..
భారత్ బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతులు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత దౌత్యానికి కీలకం కానున్నాయి. భారత్ ఇప్పటికే ఈ క్షిపణుల్ని ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేసింది. వియత్నాం, ఇండోనేషియాలు ఈ క్షిపణి కోసం చర్చలు జరుపుతున్నాయి. యూఏఈ కూడా దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. 2022 ఫిలిప్పీన్స్ 375 మిలియన్ డాలర్లలో బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2024లో వీటి సరఫరా ప్రారంభమైంది.

