Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi India Oil Gas Supply Safe West Asia War Indians Evacuation

PM Modi: చమురు, గ్యాస్‌పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ

Published Date :March 23, 2026 , 3:31 pm
By Suresh Maddala
  • చమురు, గ్యాస్‌పై ఆందోళన అక్కర్లేదు
  • గల్ఫ్, పశ్చిమాసియాలో భారతీయులంతా సురక్షితం
  • పార్లమెంట్ నుంచి ప్రపంచానికి సమైక్య స్వరం అందించాలని మోడీ పిలుపు
PM Modi: చమురు, గ్యాస్‌పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

చమురు, గ్యాస్‌పై ఆందోళన అక్కర్లేదని ప్రధాని మోడీ అన్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభంపై లోక్‌సభలో మోడీ మాట్లాడారు. ‘‘దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా కొనసాగుతోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 3,75,000 మందికి పైగా భారతీయులు సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పటివరకు ఇరాన్ నుంచి దాదాపు 1,000 మంది భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారు. వీరిలో 700 మందికి పైగా వైద్య విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా గల్ఫ్ దేశాల్లోని పాఠశాలల్లో 10, 12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసింది. విద్యార్థుల విద్యకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. హార్ముజ్ జలసంధి ద్వారా భారీ పరిమాణంలో ముడి చమురు, గ్యాస్, ఎరువులు, అనేక నిత్యావసర వస్తువులు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ జలసంధి గుండా రవాణా అత్యంత సవాలుగా మారింది. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగకుండా ఉండేందుకు మా ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. మనందరికీ తెలిసినట్లుగా దేశం ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతి చేసుకుంటుంది. సరఫరాలో అనిశ్చితి కారణంగా ప్రభుత్వం దేశీయ ఎల్పీజీ వినియోగదారులకు ప్రాధాన్యత ఇచ్చింది. అదనంగా దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచుతోంది. సరఫరాకు ఆటంకం లేకుండా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా కొనసాగుతోంది.’’ అని మోడీ అన్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య

‘‘యుద్ధ ప్రభావిత దేశాల్లోని మన రాయబార కార్యాలయాలు భారతీయులకు నిరంతరం సహాయం అందిస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న భారతీయులైనా.. పర్యటిస్తున్న పర్యాటకులైనా.. అందరికీ సాధ్యమైనంత సహాయం అందిస్తున్నారు. రాయబార కార్యాలయాలు క్రమం తప్పకుండా సలహాలు జారీ చేస్తున్నాయి. భారతదేశంలో ఇతర ప్రభావిత దేశాల్లో 24 గంటల హెల్ప్‌లైన్‌లు, అత్యవసర హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశాం. వీటి ద్వారా ప్రభావిత ప్రజలందరికీ తాజా సమాచారం అందించబడుతోంది. సంక్షోభ సమయాల్లో భారతదేశంలో.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత అత్యంత ముఖ్యం.’’ అని అన్నారు.

‘‘యుద్ధ ప్రభావం దీర్ఘకాలం కొనసాగవచ్చు.. కరోనా సంక్షోభానికి సిద్ధంగా ఉన్నట్లే ఇప్పుడు కూడా సిద్ధంగా ఉండాల్సిందే. కోవిడ్-19 సంక్షోభానికి మనం ఎలా సిద్ధంగా ఉన్నామో.. అలాగే దీనికి కూడా సిద్ధంగా ఉండాలి. మనం సంసిద్ధంగా ఉండడమే కాకుండా ఐక్యంగా ఉండాలి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇలాంటి సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడూ ఎదుర్కొంటాం’’ అని తెలిపారు.

‘‘భారతదేశంలో భవిష్యత్తులో తలెత్తే చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కొత్త దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాం. దీనికి ఇథనాల్ వంటివి తోడవ్వడం, రైల్వేల విద్యుదీకరణ, ఈవీలు, ప్రత్యామ్నాయ ఇంధనంపై చేసే కృషి సురక్షితమైన భవిష్యత్తును అందిస్తాయి. ప్రస్తుతం మనకు లభించే శక్తిలో సగం పునరుత్పాదక వనరుల నుంచే వస్తోంది. కొత్త వనరుల నుంచి 250 గిగావాట్ల విద్యుత్ వస్తోంది. 40 లక్షల రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. అణుశక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వార ఐదేళ్లలో 1500 మెగావాట్ల జలవిద్యుత్ సామర్థ్యం పెరిగింది.’’ అని పేర్కొన్నారు.

‘‘ఈ సంక్షోభంపై భారత పార్లమెంట్ నుంచి ఒక ఏకగ్రీవ, సమైక్య స్వరం ప్రపంచానికి చేరడం అత్యవసరం. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి భారతీయుడికి అవసరమైన సహాయం అందించాం. నేను స్వయంగా రెండు విడతలుగా పశ్చిమ ఆసియా దేశాధినేతల్లో చాలా మందితో ఫోన్లో మాట్లాడాను. వారందరూ భారతీయుల భద్రతకు పూర్తి హామీ ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఈ కాలంలో కొందరు విషాదకరంగా మరణించారు, మరికొందరు గాయపడ్డారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు సహాయం అందించబడుతోంది.’’ అని చెప్పారు.

#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "… Another major challenge of the war is that the summer season is beginning in India. In the coming days, with rising temperatures, the demand for electricity will increase. Currently, adequate coal stocks… pic.twitter.com/CC393Nivjj

— ANI (@ANI) March 23, 2026

On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "Because of such efforts, many of our ships that were stranded in the Strait of Hormuz have also arrived in India. Due to ethanol blending, we are saving the import of about 4.5 crore barrels of oil every year.… pic.twitter.com/MaURhm7jvC

— ANI (@ANI) March 23, 2026

#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "… In the last 11 years, India has diversified its energy imports. Earlier, for energy needs like crude oil, LNG and LPG, imports were made from 27 countries, but today India imports energy from 41… pic.twitter.com/ElXZOR6b1C

— ANI (@ANI) March 23, 2026

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CBSE Gulf exams cancelled
  • Hormuz Strait oil disruption India
  • India energy strategy renewable push
  • India fuel supply status 2026
  • Indian embassy helpline evacuation

తాజావార్తలు

  • PM Modi: చమురు, గ్యాస్‌పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ

  • CM Revanth Reddy: ప్రతి కుటుంబానికి భరోసా.. దేశంలో ఎక్కడా ఇలాంటి సదుపాయం లేదు

  • Raghav Chadha: వినియోగదారుల డబ్బుకు విలువ ఎక్కడ? వాడని డేటా ఎక్కడికి పోతుంది..!

  • PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య

  • PM Modi: గల్ఫ్‌లో ఉన్న భారతీయుల భద్రతే మా ప్రాధాన్యత.. ఇంధన భద్రతపై ప్రధాని మోడీ హామీ

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions