NTV Telugu Site icon

PM Modi: “నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంలో కుట్ర”.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..

Pm Modi, Navin Patnayak

Pm Modi, Navin Patnayak

PM Modi: ఒడిశా అసెంబ్లీతో పాటు అధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బీజేపీ నేతలు బిజూ జనతాదళ్(బీజేడీ) చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ రోజు ఒడిశాలోని బరిపాడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వెనుక కుట్ర ఉందని అన్నారు. తాము నవీన్ పట్నాయక్ మెడికల్ హిస్టరీపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.

‘‘నవీన్ పట్నాయక్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం వెనుక కుట్ర దాగి ఉందా? ప్రస్తుతం ఆయన తరపున పట్నాయక్ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు అతని ఆరోగ్యం అకాస్మాత్తుగా క్షీణించడానికి కారణమా..?’’ అని ప్రధాని ప్రశ్నించారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత, నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడానికి గత కారణాలు తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని చెప్పారు.

Read Also: Karthikeya: ఖైదీ టైపులో ఊహించుకున్నా.. తెలుగులో విలన్ ఆఫర్స్ : కార్తికేయ ఇంటర్వ్యూ

ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత వీకే పాండియన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తు్న్నారు. బీజేపీకి ఓటేస్తే ఒడిశాకు చెందిన వ్యక్తినే సీఎం చేస్తామని, తమిళనాడు బాబునున కాదంటూ గత వారం అమిత్ షా అన్నారు.

ఒడిశాలోని 21 లోక్‌సభ స్థానాలతో పాటు 147 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేడీ, బీజేపీ రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 08 స్థానాలు గెలుచుకుంది. అధికార బీజేడీ 12 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 16.9 శాతం పెరిగింది.