Modi-Putin: పుతిన్‌కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ

  • పుతిన్‌కు ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాదాన్ని బహూకరించిన ప్రధాని మోదీ.
  • భారత్ మండపంలో మోదీ-పుతిన్ ప్రత్యేక భేటీ.
  • తమిళ సాధువు తిరువళ్లువర్ రచించిన ప్రసిద్ధ గ్రంథం తిరుక్కురళ్.
Putin Modi

Putin Modi

Modi-Putin: న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు అంతా సిద్ధమైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఈ శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ రేపు భారత్‌లో అడుగుపెట్టనున్నారు. వీరితో పాటు సభ్యదేశాలధినేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే, శుక్రవారం మోడీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి.

ఈ సమావేశాల్లో ప్రధాని మోడీ, పుతిన్‌కు ప్రత్యేక బహుమతి అందించారు. తమిళ సాధువు తిరువళ్లువర్ రచించిన ప్రసిద్ధం గ్రంథం ‘‘తిరుక్కురళ్’’ రష్యన్ అనువాదాన్ని అందించారు. భారతమండపంలో బ్రిక్స్ సమావేశాలకు ముందు ఈ భేటీ జరిగింది. మోడీ, పుతిన్‌కు తిరుక్కురళ్ విశిష్టతను వివరించారు. తిరువళ్లువర్ మానవ జీవితంలో అనేక విలువలు, నైతిక అంశాలను ఈ గ్రంథంలో వివరించినట్లు మోడీ తెలిపారు. రష్యన్ భాషలోకి అనువదించిన ఈ పుస్తకం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, సాంస్కృతిక బంధాలను పెంపొందించేందుకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు.

తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దీనిని ‘‘తమిళ వేదం’’గా అభివర్ణిస్తారు. సుమారు 2000 ఏళ్ల క్రితం దీనిని రచించారు. ఈ గ్రంథం అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదం అయింది. రాజు తన రాజ్యాన్ని ఎలా పాలించాలి?, మంచి పాలనకు సంబంధించిన విషయాలను ఈ గ్రంథంలో తిరువల్లవర్ వివరించారు. మంత్రుల లక్షణాలు, యుద్ధం, ప్రజల సంక్షేమం వంటి అనేక విషయాలను ఈ గ్రంథం చెబుతుంది.