Site icon NTV Telugu

PM Modi : యువతే వికసిత్ భారత్ శక్తి.. Gen Zపై మోడీ ప్రశంసలు.!

Pm Modi

Pm Modi

భారతదేశ యువత, ముఖ్యంగా జెన్ జెడ్ (Gen Z) తరానికి చెందిన వారిలో అపారమైన సృజనాత్మకత దాగి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. న్యూఢిల్లీలో జరిగిన ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ ముగింపు సమావేశంలో ప్రసంగించిన ఆయన, నేటి యువత కేవలం కొత్త ఆలోచనలతో సరిపెట్టుకోకుండా, అంకితభావంతో దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరుపుకునే జాతీయ యువజన దినోత్సవం రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సందర్భోచితమని, వివేకానందుడి బోధనల స్ఫూర్తితోనే యువత కోసం ఇలాంటి వేదికలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఆయన వివరించారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న స్టార్టప్ విప్లవం యువశక్తికి నిదర్శనమని, గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల యువతకు అనేక అవకాశాలు లభిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న ఏపీ సర్కార్..

ముఖ్యంగా సంస్కృతి, సృజనాత్మకత కలగలిసిన ‘ఆరెంజ్ ఎకానమీ’లో భారతదేశం సాధిస్తున్న అద్భుతమైన వృద్ధికి యువత ఇస్తున్న కంటెంట్ , వినూత్న ఆలోచనలే కారణమని మోడీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులను అత్యంత పారదర్శకమైన క్విజ్, వ్యాసరచన , ప్రజెంటేషన్ వంటి మూడు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది నుండి ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి అవసరమైన ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌’కు యువశక్తే ఇంధనమని, 2047 నాటికి వికసిత్ భారత్‌ను నిర్మించడంలో నేటి జెన్ జెడ్ యువత కీలక భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యువత ప్రతి ఆలోచన దేశ భవిష్యత్తును దిశానిర్దేశం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Jana Sena Party: ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు జనసేన కీలక విజ్ఞప్తి.. అది వ్యవస్థ లోపమే..!

Exit mobile version