Site icon NTV Telugu

Bharat Express Train: తమిళనాడులో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రారంభించిన ప్రధాని మోడీ

Vande Bharat Train

Vande Bharat Train

Bharat Express Train: ప్రధాని నరేంద్రమోదీ శనివారం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణలో వందేభారత్ ట్రైన్ తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్యలో 12వ వందేభారత్ రైలును ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం అనంతరం తమిళనాడు పర్యటకు వెళ్లారు.

Read Also: Jagadish Reddy: మోడీ రైలు ఓపెనింగ్‌కు వచ్చి.. తెలంగాణపై విషం చిమ్మారు..

చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఇది దేశంలో 13వ వందే భారత్ ట్రైన్. ఈ రైలు తమిళనాడు రాజధాని చెన్నైని, రెండో అతిపెద్ద నగరమైన కోయంబత్తూర్ తో కలపనుంది. డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేసణ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రైలులో పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు ప్రధాని.

ఈ రైలు రెండు నగరాల మధ్య కేవలం 5.50 గంటల్లోనే ప్రయాణించనుంది. దాదాపుగా గంట పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించనుంది. తమిళనాడులో రెండు నగరాల మధ్య నడుస్తున్న తొలి వందేభారత్ ట్రైన్ ఇదే. దీంట్లో స్వదేశీ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్’ ఉంది. అన్ని కోచుల్లో సీసీ కెెమెరాలు, ఆటోమెటిక్ స్లైడింగ్ డోర్లలతో పాటు భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్ ఆర్ ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర సహాయమంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు.

Exit mobile version