NTV Telugu Site icon

PM Modi: బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ముహమ్మద్ యూనస్‌కి మోడీ శుభాకాంక్షలు..

Pm Modi, Muhammad Yunus

Pm Modi, Muhammad Yunus

PM Modi: షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఈ రోజు ఏర్పాటు చేశారు. బాధ్యతలు స్వీకరించిన యూనస్‌కి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో త్వరగా సాధారణ స్థితికి రావాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని హిందువులు మరియు ఇతర మైనారిటీ వర్గాల భద్రత మరియు రక్షణ కోసం పిలుపునిచ్చారు.

Read Also: MP Shocker: ఏడుస్తుందని ప్రియురాలి కుమార్తెను చంపేసిన వ్యక్తి..

‘‘ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ తన కొత్త బాధ్యతలను స్వీకరించినందుకు ఆయనకు నా శుభాకాంక్షలు. హిందువులు మరియు అన్ని ఇతర మైనారిటీ వర్గాల భద్రత మరియు రక్షణకు భరోసానిస్తూ, సాధారణ స్థితికి త్వరగా తిరిగి రావాలని మేము ఆశిస్తున్నాము.దేశాల ప్రజల ఆకాంక్షలు, శాంతి, భద్రత, అభివృద్ధి కోసం బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది.’’ అని ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

రిజర్వేషన్ కోటా విషయంలో విద్యార్థులు, ప్రజల ఆందోళ తీవ్రస్థాయికి చేరి హింసకు దారి తీయడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయి భారత్ వచ్చారు. ఇక్కడ నుంచి ఆమె లండన్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ హింసలో 500 మందికి పైగా మృతి చెందారు. ముఖ్యంగా హసీనా రాజీనామా తర్వాత ఆ దేశంలో హిందువుల్ని, అవామీ లీగ్ పార్టీకి చెందిన నేతల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేశారు. హిందూ దేవాలయాలను తగలబెట్టడంతో పాటు మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు.