PM Modi: ఒకే రోజు 9 ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని మోడీ..

  • వరస సమావేశాలతో బిజీగా ప్రధాని నరేంద్రమోడీ..
  • ఒకే రోజు 9 ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్న పీఎం..
  • ఏడుగురు దేశాధినేతలు, ఇద్దరు గ్లోబల్ సీఈవోలతో చర్చలు..
Pmmodi

Pmmodi

PM Modi: భారత్-యూరప్ మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు సాంకేతిక సహకారాన్ని విస్తరించేందుకు ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఉన్నతస్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన 7 దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఇదే కాకుండా ఇద్దరు గ్లోబల్ సీఈఓలతో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ స్పెయిన్, ఫిన్లాండ్, సెర్బియా, క్రొయేషియా, ఎస్టోనియా, కజకిస్తాన్, భూటాన్ దేశాల నాయకులతో చర్చల్లో పాల్గొన్నారు.

Read Also: Night Cream for Glowing Skin: మీ చర్మం సహజంగా మెరిసిపోతుంది.. ఇంట్లోనే ఇలా నైట్‌ క్రీమ్‌ తయారు చేసుకోండి..

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సన్ మైక్రోసిస్టమ్స్ కో-ఫౌండర్‌లతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. AI ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్, ఫిన్లాండ్ ప్రధానమంత్రి పెట్టెరి ఓర్పో‌తో సమావేశాలు నిర్వహించారు. మోడీ, సాంజెచ్ మధ్య రక్షణ, భద్రత, సాంకేతిక సహా కీలక రంగాల్లో చర్చలు జరిగాయి. స్పెయిన్-భారత్ సహకారాన్ని విస్తరించాలని ఇద్దరు నేతలు భావించారు. యూరోపియన్ యూనియన్(ఈయూ)తో ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) స్పెయిన్ తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.