PM Modi: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌కు మోడీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ
- ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌కు మోడీ ఫోన్
- తాజా పరిణామాలపై చర్చ
- ఎక్స్‌లో తెలియజేసిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు, ప్రాణ నష్టంపై మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే భారతీయుల భద్రత, ఇంధన సరఫరాపై కీలకంగా మోడీ చర్చించారు.

Also Read
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
- Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
- Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
ఫోన్ సంభాషణ తర్వాత మోడీ కీలక ట్వీట్ చేశారు. ‘‘పశ్చిమాసియాలోని తీవ్రమైన పరిస్థితి గురించి చర్చించడానికి ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్‌తో మాట్లాడాను. ఉద్రిక్తతలు పెరగడం, పౌర ప్రాణనష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను.’’ అని రాసుకొచ్చారు.
ప్రపంచ సంక్షోభం నుంచి ఉత్పన్నమయ్యే ఆర్థిక ఒత్తిళ్లను ప్రభుత్వం ఎలా నిర్వహించిందో రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ సమయంలో భారతదేశం విధానాన్ని ప్రధానమంత్రి మోడీ గుర్తుచేవారు. ‘‘యుద్ధ పరిణామాల భారం భారత పౌరులపై పడకుండా చూసుకోవడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్ని ప్రయత్నాలు చేసింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పెరిగినప్పుడు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ రైతులకు రూ. 300కు యూరియా బ్యాగ్‌ను అందించాం. ఇది అంతర్జాతీయ మార్కెట్లో రూ. 3,000 ఖర్చవుతుంది.’’ అని మోడీ అన్నారు. తాజాగా రాష్ట్ర అధికారుల సహకారం కోరుతూ.. ప్రస్తుత సంక్షోభ సమయంలో మార్కెట్ తారుమారు, తప్పుడు సమాచారంపై కఠినమైన అప్రమత్తతను పాటించాలని ప్రధాని మోడీ కోరారు.
ఇది కూడా చదవండి: Netanyahu: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి
గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు దిగింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అయితే ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ఇరాన్ పెద్దలతో దౌత్యం నిర్వహించారు. దీంతో హార్ముజ్ నుంచి భారత నౌకలు సాఫీగా పంపించేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రస్తుతం 28 నౌకలు భారత్‌కు వస్తున్నాయి.
Had a conversation with Iranian President, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region.
Expressed deep concern over the escalation of tensions and the loss of civilian lives as well as damage to civilian infrastructure.
The safety and security of…
— Narendra Modi (@narendramodi) March 12, 2026
తాజావార్తలు
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?