Site icon NTV Telugu

PM Modi: గత ఢిల్లీ పాలకులు ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకోలేదు

Modi23

Modi23

గత ఢిల్లీ పాలకులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాని మోడీ విమర్శించారు. మోడీ సోమవారం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇటానగర్‌ సభలో మోడీ ప్రసంగించారు. సూర్యకిరణాలు ముందుగా పడే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ అయినప్పటికీ.. వేగవంతమైన అభివృద్ధి కిరణాలు చేరుకోవడానికి చాలా దశాబ్దాలు పట్టిందని తెలిపారు. ఢిల్లీ నుంచి దేశాన్ని నడిపిన నాయకులు అరుణాచల్‌ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ మనస్తత్వం కారణంగానే అరుణాచల్‌తో పాటు ఈశాన్య ప్రాంతాలకు తీవ్రమైన హాని జరిగిందన్నారు.

ఇది కూడా చదవండి: Supreme Court: దురదృష్టకరం.. ఎయిరిండియా ప్రమాద కథనాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

2014లో తనకు దేశానికి సేవ చేసే అవకాశం లభించిందని.. ఆ సమయంలోనే దేశాన్ని కాంగ్రెస్ మనస్తత్వం నుంచి విముక్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన అరుణాచల్ ప్రదేశ్.. 2014 నుంచి తమ పాలనలో అభివృద్ధి ప్రాధాన్యతా కేంద్రంగా మారిందని తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్‌కు రెండు లోక్‌సభ స్థానాలు ఉండడంతోనే పెద్దగా పట్టించుకోలేదనుకుంటా? అని విమర్శించారు. ఇప్పుడు ఈశాన్య ప్రాంతం భారతదేశ శక్తి కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.

ఇది కూడా చదవండి: Nitin Gadkari: బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లేకపోవడం దేవుడు నాకిచ్చిన అతిపెద్ద వరం

అరుణాచల్‌ప్రదేశ్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (240 మెగావాట్లు), టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (186 మెగావాట్లు) ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 3,700 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌లు చేపట్టనున్నారు. ఇక తవాంగ్‌లో 9,820 అడుగుల ఎత్తులో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. 1,500 మందికి పైగా అతిథులు కూర్చునే సామర్థ్యం ఉంటుంది.

 

Exit mobile version