Site icon NTV Telugu

Rishi Sunak: రిషి సునాక్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

Modi, Sunak

Modi, Sunak

Prime Minister Modi congratulates Rishi Sunak: యూకే ప్రధాని పదవిని చేపట్టబోతున్నారు రిషి సునక్. యూకే ప్రధానిగా తొలిసారిగా ఓ భారతీయ సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ రాజీనామాతో యూకేలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. మరోసారి ప్రధాని ఎన్నిక అనివార్యం అయింది. అయితే ప్రధాని రేసులో రిషి సునాక్ తో పాటు పెన్నీ మోర్డాంట్, బోరిస్ జాన్సన్ ఉన్నా.. చివరకు వీరిద్దరు విరమించుకోవడంతో ఏకగ్రీవంగా రిషి సునాక్ విజయం సాధించారు. ప్రస్తుతం బ్రిటన్ ఉన్న పరిస్థితుల నుంచి రిషి సునాక్ గట్టెక్కిస్తారని అక్కడి ఎంపీలు భావిస్తున్నారు. ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read Also: Crime News: పండుగ పూట దారుణం.. టపాసులు కాల్చొద్దు అన్నాడని హత్య చేసిన మైనర్లు

ఇదిలా ఉంటే యూకే ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా తన అభినందనలు తెలియజేశారు. ప్రపంచ సమస్యలు, 2030 రోడ్ మ్యాప్ కోసం ఇరు దేశాలు కలిసి పనిచేద్దాం అని అన్నారు. యూకేలోని భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మన చారిత్రాత్మక సంబంధాలను ఆధునికంగా మార్చుకుందాం అని ట్వీట్ చేశారు.

ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రధాని ఎన్నిక అవసరం అయింది. రిషి సునాక్ వైపే మెజారిటీ ఎంపీలు మొగ్గు చూపారు. ప్రత్యర్థిగా నిలిచిన పెన్నీ మోర్డాంట్ ప్రధాని పోటీకి అవసరమైన 100 ఎంపీల మద్దతు కూడా పొందలేకపోయారు. దీంతో ఆమె పోటీ నుంచి వైదొలిగారు. చివరకు ఏకగ్రీవంగా రిషి సునాక్ ప్రధానిగా గెలుపొందారు.

Exit mobile version