NTV Telugu Site icon

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. రేపే పీఎం కిసాన్ నిధులు జమా..

Pm Kisan

Pm Kisan

PM Kisan: పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని మోడీ ఈ పథకం కింద 19వ విడతగా మొత్తం రూ.22వేల కోట్లను రేపు (ఫిబ్రవరి 24) విడుదల చేయనున్నారు. బీహార్‌లోని భాగల్పూర్‌లో జరగనున్న ఒక కార్యక్రమంలో ప్రధాని ఈ నిధులను రిలీజ్ చేస్తారు. అయితే, ఈ ఏడాది చివరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని ఈసారి భాగల్పూర్‌ను వేదికను ఎంచుకున్నారు. రైతులకు ఏటా ఒక్కో విడత రూ.2వేల చొప్పున 3 విడతల్లో 6 వేల రూపాయల సాయం అందించే పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర సర్కార్ 2019 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభించింది. ఇక, ఇప్పటి వరకు సుమారు 11 కోట్ల మంది రైతులకు 18 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లను మోడీ ప్రభుత్వం చెల్లించింది.

Read Also: IND vs PAK: నేడే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ పోరు.. గెలిచేదెవరో.. ?

అయితే, పీఎం కిసాన్ పథకం ప్రారంభించి ఆరేళ్లైన సందర్భాన్ని పురస్కరించుకొని 19వ విడత నిధుల విడుదల కోసం రేపటి తేదీని ఎంచుకున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నాడు దేశవ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాల్లో ‘‘కిసాన్‌ సమ్మాన్‌ సమారోహ్‌’’ కార్యక్రమం నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి అవగాహన కల్పించనున్నారు.

Read Also: Sarangapani Jathakam : సారంగపాణి జాతకం సమ్మర్ లో తెలుస్తుంది

కాగా, పీఎం కిసాన్‌ పథకం కింద 19వ విడతగా మొత్తం రూ.22 వేల కోట్లను రేపు ప్రధాని మోడీ రిలీజ్ చేయనున్నారు. కేంద్ర సర్కార్ ఏటా డిసెంబర్- మార్చ్, ఏప్రిల్‌-జులై, ఆగస్టు- నవంబర్ మధ్యలో రూ.2 వేల చొప్పున పీఏం కిసాన్‌ ఈ పథకం కింద చెల్లిస్తుంది. తొలి విడతలో రూ.6,324.24 కోట్లతో స్టార్ట్ అయి.. ఈ పథకం 18వ విడత వచ్చేసరికి రూ.20,665.17 కోట్లకు చేరిపోయింది. 2024 ఆగస్టు-నవంబర్ మధ్య కాలంలో రిలీజ్ చేసిన 18వ విడతలో ఏపీలో 41,22,499 మందికి రూ.836.31 కోట్లు, తెలంగాణలో 30,77,426 మందికి 627.46 కోట్లు ఈ పథకం కింద రిలీజ్ చేశారు.